భక్త జనాబాయి! అచ్యుతుని రాజ్యశ్రీ
 పాండురంగని భక్తుల్లో జనాబాయి  పేరు శాశ్వతం అజరామరం.అప్పుడామె వయసు కేవలం ఐదేళ్లు.అమ్మానాన్నల్తో కల్సి పండరీపురం వెళ్లి అక్కడ దైవం ని చూసి " నేనింక మీతో రాను.ఇక్కడే ఉంటానని మొండి కేస్తుంది.ఇక చేసేదేం లేక వారు పాపని విడిచి వెళ్ళడం తో ఆపాప గుడిలో దైవ స్మరణ ధ్యానం లో మునిగింది.కమ్మగా గొంతెత్తి పాటలు పాడి భక్తుల మన్ననలు పొందింది.భక్తనామదేవుడు ఆపాపని ఇంటికి తీసుకుని వెళ్లి తల్లి గుగాబాయికి అప్పగించాడు.ఓసారి గాలికివారున్న పూరిపాక కప్పు ఎగిరిపోయింది.అంతా గాఢనిద్రలో ఉన్నారు.భగవంతుడు పాండురంగడే స్వయం గా వచ్చి నాకు పైకప్పు ని బాగు చేశాడు.మెలుకువ వచ్చిన జనాబాయి ఆయన పాదాల పై పడుతుంది." నాకు ఆకలేస్తోంది. ఏదైనా తింటానికిపెట్టు" అని ఆయన అడిగితే వంటి చేసి పెట్టింది.పాండురంగడు ఆమె కి తన చేతితో ఆమెకు కూడా ఆమె వంటకాలు చేతిలో పెట్టి దగ్గర ఉండి తినిపిస్తాడు.ఒకసారి జనాబాయి చేసిన పిడకలను పొరుగు ఆమె ఎత్తుకు పోతుంది.చాలామంది భక్తులు కబీర్ దాస్ కూడా అక్కడ ఉన్నారు.జనాబాయి అంది" నేను చేసిన పిడకలను చెవి దగ్గర పెట్టుకుంటే అవి పాండురంగని పేరు అంటుంటాయి. నాపిడకలని తన పిడకలు అని ఈపొరుగామె కాజేసింది"  అని చెప్పింది.అలా అక్కడున్న భక్తులు పిడకలు జనాబాయికిచెందినవే అని తీర్మానించారు.అంతా భక్తురాలైన జనాబాయిని జనం ఎలా అవమానించారో చూడండి. ఒకరోజు ఆమె జొన్నలు తిరగలి లో వేసి తిప్పుతుంటే ఆరాత్రి పాండురంగడు కూడా వచ్చి ఆమె కి సాయపడతాడు.బ్రాహ్మీముహూర్తంలో స్వామి తన నగలు అక్కడే మర్చిపోయి జనాబాయి బొంత కప్పుకుని మాయం అవుతాడు.పూజారి ఆలయం తలుపులు తెరవగానే విగ్రహం పైనున్న నగలు కన్పడవు కానీ బొంతను చూసి జనాబాయి దొంగ అని నిర్ణయానికి వచ్చారు.ఆమెనుఉరితీయాలని నిశ్చయించారు.ఆమె ఇంట్లో నగలు కన్పడ్తాయి.చంద్రభాగా నదీతీరంలో ఎర్రటి వస్త్రాన్ని చుట్టి నడుంకి త్రాడుకట్టి ఈడ్చుకుంటూ ఉరికంబం ఎక్కిస్తారు.పాండురంగధ్యానంలో మునిగిపోయింది ఆమె.ఆశ్చర్యం! ఉరికంభం మాయమైపరిమళపూలహారాలు కన్పించాయి.అంతే..ఆమె మహిమ అందరికీ తెలిసింది.స్వయంగా పాండురంగడే జనాబాయి పాడిన ఆమె గానం చేసిన కీర్తనలు రాశాడు.ఇప్పటికీ ఆమె కీర్తనలు మహారాష్ట్ర లో పాడుకుంటూ ఉంటారు🌺
కామెంట్‌లు