శ్రీవిష్ణు సహస్రనామాలు బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
411)హిరణ్యగర్భః -

పరబ్రహ్మ అవతారుడైనవాడు
బంగారు తామరనున్నవాడు
హిరణ్యగర్భ నామమున్నవాడు
పద్మనాభుని సుతుడైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
412)శత్రుఘ్నః -

శత్రువులను సంహరించిన వాడు
రిపులను పారద్రోలిన వాడు
పగవారిని వెళ్లగొట్టువాడు
దండెత్తువార్ని తొలిగించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
413)వ్యాప్తః -

సర్వత్రా వ్యాప్తిచెందినవాడు
అలుముకొనియున్నట్టి వాడు
ప్రసిద్ధికెక్కినట్టి వాడు 
భక్తులు పొందబడినట్టి వాడు 
 శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
414)వాయుః -

వాయు రూపంలో నున్నవాడు
సకల పోషకుడు తానైనవాడు
సర్వత్రా ఆవరించినవాడు
గాలిని శ్వాసగా నిలుపువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
415)అధోక్షజః -

స్వరూపంనుండి తొలగించనివాడు
స్థితినుండి జారనీయనివాడు
అధోగతినీయనట్టి వాడు
స్థిరత్వము కలిగించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు