సోzహం"భావ రూపుడు... ఆత్మభవుడు ;- "కవి మిత్ర" శంకర ప్రియ ., శీల.,సంచార వాణి :- 99127 67098 -
    "ఓం"కారేశ్వర! శ్రీరుద్ర!
 "హ్రీం"కార శక్తి స్వరూప!
     "ఉమా"మహేశ్వర! శివ!
  శివా నమో! నమశ్శివ!

    అథ "ఓం"కారమే నీవు!
  "సోzహం"భావ రూపుడవు!
    పరమ"హంస"వు నీవె!
 సదాశివ! నమశ్శివ!
       (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)

  🔱పరమేశ్వరుడు.. ప్రణవస్వరూపుడు! అందరిలో "సోzహం" భావంతో... అనగా "నేను" అనెడు సద్భావనతో విరాజిల్లు, ఆత్మభవుడు! పరమ "హంస" స్వరూపుడు!  చరాచర ప్రపంచసృష్టికి మూలకారణుడు! సత్.. చిత్.. ఆనంద స్వరూపుడు .. సాంబశివ పరంబ్రహ్మ!

🔆 అథ మంగళాచరణ శ్లోకము:-
   ఓo నమోz(అ)హం పదార్థాయ
   లోకానాం సిద్ధి హేతవే!
   సచ్చిదానంద రూపాయ
   శివాయ పరమాత్మనే!
          ఇది.. జగద్గురు శ్రీకంఠ శివాచార్యులు, విరచితమైన "శ్రీకంఠ భాష్యం" మంగళాచరణ శ్లోకము! ఇందులో... "ఓమ్" కారము, "నమః"శబ్దము, "శివాయ" పదము.. పొందుపర్చ బడినవి!
      ప్రణవసహిత, శ్రీశివ పంచాక్షరియే "తారక మహా మంత్రము"! కనుక, ఈ శ్లోకమును .. అనుదినము ఏకాదశ (11) పర్యాయములు, భక్తి శ్రద్ధలతో పారాయణం చేయండి!  శ్రీసాంబ సదాశివుని దివ్యానుగ్రహంతో ... సమస్త శుభములు, జయములు పొందoడి!  శివమస్తు!

      🚩కంద పద్యం
   "ఓం"కారరూపుడు నగు, శు
   భంకరు, "డహ"మను పదార్థ భవ్యునకు, నే
   నంకిత భావము తోడ, న
   హంకారము వీడి, కొలుతు ననవరతమ్మున్!

      🚩తేట గీతి పద్యం 
    ప్రణవ రూపు, నోంకార పరాత్సరునకు
   లోక సృష్టికి కారణ రూపునకును
   పరమ శివునకు ప్రణమిల్లి, భక్తితోడ
  సచ్ఛిదానంద రూపుని సన్నుతింతు!
          (రచన:- డా. శాస్త్రుల రఘుపతి.,)
కామెంట్‌లు