అనగనగా మాందాబాద్ అనే ఊరిలో సీత, గీత అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్లు ఒక రోజు బడికి వెళ్తుంటే దారిలో కొన్ని డబ్బులు కనిపించాయి. వారిద్దరూ ఆ డబ్బులను తీసుకున్నారు. దారిలో వచ్చి పోయే వాళ్లను ఈ డబ్బులు మీవా అని అడగసాగారు. ఎవ్వరు కూడా మావి కాదు. మావి కాదు. అంటూ వెళ్లిపోయారు.
వాళ్ళిద్దరికీ కూడా డబ్బులు ఏం చేయాలో అర్థం కాలేదు. దారిలో ఇద్దరు ఆకలితో వెళ్తున్న ముసలి వాళ్లకు డబ్బులు ఇచ్చి అన్నం తినుమన్నారు. వాళ్లు ఆ డబ్బులతో అన్నం తిని ఆకలి తీర్చుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఆ ముసలి వాళ్లు ఇద్దరు కూడా కొత్త బట్టలు తీసుకుని వచ్చి బడిలో ఉన్న సీత, గీతలకు ఇచ్చి మేము ఆకలితో ఉన్నప్పుడు వారికి దొరికిన డబ్బులు వారు తీసుకోకుండా, మా ఆకలి కొరకు ఇచ్చినందుకు ఈ బట్టలు ఇస్తున్నామని తెలిపారు.
సీత, గీతలు డబ్బులు స్వార్థానికి వాడుకోకుండా ఇతరుల ఆకలి తీర్చేందుకు ఇచ్చినందుకు బడిలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అభినందించారు. సీత, గీతల మాదిరిగానే ఇతరులకు సహాయం చేయాలని, ఏదైనా వస్తువు దొరికితే తిరిగి వారికి ఇవ్వాలని, లేనిపక్షంలో పెద్దలకు అప్పగించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి