నీటిని వృధా చేయవద్దు;- మూగ అక్షయ-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9959730286
 నీళ్లు ఉంటేనే మనకు జీవితం
నీళ్లు ఉంటేనే ప్రకృతికి అందం
నీళ్లు లేని భూమి లేదు
నీళ్లు లేకుండా గమనం లేదు
నీళ్లను కాపాడుకుంటేనే బ్రతుకుతాం
నీళ్లను వృధా చేస్తే తరుగుతాం
వృధా నీటిని మొక్కలకు మళ్లించాలి
పచ్చని ప్రకృతితో వర్షాన్ని ఆహ్వానించాలి
నీళ్ళ ద్వారానే మనిషికి ఆరోగ్యం
నీళ్లు ఉంటేనే అందరు సంతోషంగా ఉంటారు
నీళ్లు లేని జీవితం ఊహించలేము
నీళ్ల ద్వారానే పంటలు పండుతాయి
నీళ్ళు తాగితేనే జీవజాలం బతుకుతుంది
అన్నింటికీ ఆధారం నీళ్లు
మనిషి గుండె దరువు నీళ్లు

కామెంట్‌లు