రామాయణానికి పూర్వం (1);- సేకరణ: బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .9884429899

 సూర్య వంశము.
 ఆదిపురుషుడు వివస్వంతుడురెండవవివస్వంతుడు. ( సూర్యుడు 108 పేర్లతో పిలవ బడ్డాడు)#12 మంది సూర్యు పేర్లు వివరణ...
సూర్యుడు విష్ణుమూర్తి అవతారం. అందుకే ప్రత్యక్ష నారాయణుడనీ సూర్య నారాయణుడనీ పిలుస్తాం. 
వేదాలలో, పురాణాలలో ద్వాదశాదిత్యుల గురించి చెప్పబడింది. ద్వాదశ అంటే పన్నెండు. 
ఆదిత్యుడు అంటే అదితీ పుత్రుడు. ఆయనే సూర్యుడు. శ్రీ మహావిష్ణువు పన్నెండు విధాలుగా సూర్యుని రూపం లో దర్శనమిస్తాడు. 
ఆ పన్నెండు రూపాలను ద్వాదశాదిత్యులు అంటాం. సంవత్సరానికి గల పన్నెండు నెలలలో నెలకొక్క రూపంగా ద్వాదశాదిత్యులు దర్శనమిస్తారు.
 ఛందోగ్యోపనిషత్తులో పదవ ఆదిత్యుడైన విష్ణువే అదితీ పుత్రుడైన వామనుడు అని చెప్పబడింది.
భాగవత పురాణం లోనూ,లింగ పురాణం లోనూ, బ్రాహ్మణాల లోనూద్వాదశాదిత్యుల ప్రస్తావన ఉంది.
1. వరుణ 
2. మిత్ర
3. ఆర్యమాన 
4. భాగ  
5. అంశుమాన  
6. ధాతా 
7. ఇంద్ర
8. సవిత్ర  
9. త్వస్త్ర 
10. విష్ణు 
11. పూషణ 
12. వివస్వత
 భాగవత పురాణం లో ఎనిమిదవ ఆదిత్యుని పేరు
 ' పర్జన్యుడు ' . బ్రహ్మణాలలో తొమ్మిదవ ఆదిత్యుని పేరు ' యమ ' , పదవ ఆదిత్యుడు ' సూర్యుడు / అర్కుడు ' పదకొండవ ఆదిత్యుడు ' దక్షుడు ' , పన్నెండవ ఆదిత్యుడు ' రవి ' వీరే మన పురాణాలలో వేదాలలో చెప్పబడిన పన్నెండుమంది సూర్యులు .
 యజుర్వేదం లోనూ , శతపథ బ్రాహ్మణం లోనూ ఎనిమిది మంది సూర్యుల ప్రస్తావనే ఉంది . 
 సూర్యుడు సత్యానికి ప్రతీక . ధర్మ స్వరూపుడు , కాల స్వరూపుడు . అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞాన కాంతులు వెదజల్లే అద్వితీయమైన శక్తి సమన్వితుడు . సకల జాడ్యాలనూ హరించే తేజోమయమూర్తి . 
శ్లో ...
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం  కశ్యపాత్మజం | 
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.
ఋషి కశ్యప మరియు అతని భార్య అదితికి పన్నెండు మంది కుమారులు జన్మించారు. ఒక్కొక్కరికి ఒక్కో పేరు మరియు అతని స్వంత కుటుంబం ఉంటుంది. ప్రతి కొడుకు సంవత్సరానికి ఒక నెల అధ్యక్షత వహిస్తాడు. సంజ్ఞ, ఛాయ, ఇక్షుభ మరియు రాజ్ఞి సూర్యుని రాణుల పేర్లు. మొదటి రెండు దక్షిణాదిలో ఎక్కువ ప్రసిద్ధి చెందాయి.
అతనికి గుర్రాలుగా సేవ చేయడానికి ఏడు చండాలు లేదా మీటర్లు వచ్చారు. అవి అవి
1. గాయత్రి,
2. Ūṣṇik (Uṣṇih),
3. అనుసౌభ్,
4. బృతి,
5. తీసుకోవడం
6. త్రిష్టుభ్
7. మరియు జగతి.
వారు ఏడు రోజులను కూడా సూచిస్తారు. రథానికి పన్నెండు లేదా ఆరు చువ్వలతో ఒక చక్రమే ఉండాలి. చువ్వలు ఆరు అయితే, అవి వసంత, గ్రీష్మ మొదలైన ఆరు ఋతువులను సూచిస్తాయి మరియు అవి పన్నెండు అయితే, అవి నెలలు.
సూర్యవంశంలో రెండవ వాడు వైవస్వత మనువు,అశ్వని దేవతలు, ఇక్ష్వాకుడు. ఈయన పేరు మీదుగానే వంశానికి ఇక్ష్వాకు వంశమని పేరు వచ్చింది. వైవస్వత మనువుకి ఇక్ష్వాకుడు కాకుండా నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశుడు, నృగుడు, దిష్టుడు, కరూషుడు, వృషధ్రుడు అనే తొమ్మిది మంది కుమారులు ఉన్నారు.
ఇక్ష్వాకుడికి నూరుగురు కుమారులు. వారిలో ఒకడు వికుక్షి. నాభాగుని కుమారుడు అంబరీషుడు. శర్యాతి కూతురు సుకన్య చ్యవన మహర్షి భార్య.
వికుక్షికి వశిష్ట మహర్షి అనుగ్రహముచే రాజ్యాధికారము లభించింది. అతని కుమారుడైన అయోధునకు కకుస్థుడు జన్మించాడు. ఈతడు తన కుమారులలో జ్యేష్ఠుడైన కువలాశ్వునికి రాజ్యాభిషేకము చేస్తాడు. కువలాశ్వుని పుత్రులలో దృడాశ్వునికి హర్యశ్వుడు, ఇతని మనుమడు సంహతాశ్వునికి ఇరువురు పుత్రులునూ మరియొక పుత్రిక హైమవతి జన్మించారు. హైమవతికి ప్రసేనజిత్తుడను కుమారుడు కలిగెను. ఇతని మనుమడే మాంధాత. ఈతనికి పురుకుత్సుడు, ముచికుందుడను పుత్రులు జన్మించారు.
పురుకుత్సునికి త్రయ్యారుణి యను పుత్రుడును, ఈతనికి సత్యవ్రతుడను పుత్రుడును కలిగారు. వీరిలో సత్యవ్రతుడు పరాక్రమవంతుడై రాజ్యాధికారము చేపట్టెను. ఈ సత్యవ్రతుడే తండ్రిమాట పాటించక గోమాంసమును భక్షించుట వలన మూడు పాపములు చేసి త్రిశంకుడు అని నామధేయము గలిగి, వశిష్ట మహర్షిచేత శాపగ్రస్తుడౌతాడు. విశ్వామిత్రుడు తన తపోబలము చేత త్రిశంకునికోసం స్వర్గమును సృష్టిస్తాడు. ఇదియే త్రిశంకు స్వర్గం.
త్రిశంకుడనే సత్యవ్రతుని పుత్రుడే హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు జీవిత పర్యంతము సత్యవ్రత దీక్షను పాటించి, శివానుగ్రహ భాగ్యము పొంది 'సత్య హరిశ్చంద్రుడ'ని కీర్తి పొందినాడు. ఈతని కుమారుడు లోహితుడు. ఈతని మనుమడు బాహువు.
బాహువు కుమారుడు సగరుడు. ఇతడు సామ్రాజ్యాధికారియై లోకమున మరల ధర్మమును నెలకొల్పి సగర చక్రవర్తియని కీర్తిగాంచాడు. సగరునికి ఇద్దరు భార్యలున్నారు. వీరిలో పెద్దభార్య అరువది ఆరు వేలమంది కుమారులను పొందగా, చిన్నభార్య వంశోధ్ధారకుడగు నొక పుత్రుని ప్రసాదించమని ఔర్య మహామునిని కోరుకున్నది. సగరుడు అశ్వమేధ యాగం సంకల్పించి, యాగాశ్వము వెంట అరువదియారు వేలమంది కుమారులను పంపినాడు. వారు యాగాశ్వమును వెదుకుతూ పాతాళ లోకము చేరి కపిలముని కోపాగ్నికి భస్మమైనారు. వీరు పాతాళమునకు చేరుటకు భూమిని తవ్వినందున సముద్రము యేర్పడి సగరుని పేరిట 'సాగరము'గా ప్రసిద్ధి చెందినది. వీరి తరువాత పంచజనుడు చక్రవర్తి అవుతాడు. ఈతని కుమారుడు దిలీపుడు.
దిలీపునికి జన్మించినవాడు భగీరధుడు. భగీరధుడు పితృదేవతలకు సద్గతులను ప్రసాదించుటకు ఘోర తపస్సు ఆచరించి, గంగాభవాని ని, శివుని సహాయంతో భువికి తెప్పించెను. భగీరధుని ముని మనుమడు అంబరీషుడు.
అంబరీషుని ముని మనుమడే రఘువు. ఈతని పేరిటనే 'రఘు వంశము' యేర్పడినది. రఘువు కుమారుడు అజుడు. అజమహారాజు కుమారులు సురభుడు, దశరథుడు. ఈతడు అయోధ్య రాజధానిగా చేసుకొని చిరకాలము పాలించెను. ఈతడు పుత్రకామేష్టి యాగము జరుపగా శ్రీవిష్ణువు శ్రీరాముడుగా అవతరించి, రావణ కుంభకర్ణులను సంహరించాడు. శ్రీరాముని కుమారు ద్వారా రఘువంశము విస్తరించినది. 

కామెంట్‌లు