బాల సాహిత్య సమ్మేళనం 2024
 తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మే 29,30 తేదీల్లో హైదరాబాదులో బాల సాహిత్య సమ్మేళనం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పాఠశాల విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు, బాల సాహితీవేత్తలు, బాలల కోసం రచనలు చేస్తున్నవారు పాల్గొంటారని పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల స్థాయిలో తెలుగు భాషావికాసం, బడి పిల్లల్లో రచనా భిరుచి పెంపొందించడం, పత్రికల్లో బాలల రచనలకు ప్రచురణావకాశాలు, కథలు చెప్పడంలో మెలకువలు, సంగీతం, నృత్యం,నాటకం, చిత్రలేఖనం,శిల్పం వంటి లలిత కళల పైన ప్రాథమిక అవగాహన మొదలైన సదస్సులు, గోష్టులు జరుగుతాయని తెలిపారు. ప్రతినిధులుగా పాల్గొనదలిచేవారు ఈనెల 30వ తేదీలోగా 960 3727 234 వాట్సాప్ నెంబర్ కు వివరాలు పంపి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శాంతా వసంతా ట్రస్టు వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కే. ఐ వరప్రసాదరెడ్డి వారి మాతృమూర్తి శాంతమ్మ గారి సంస్మరణార్థం గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల నిర్వహణకు ఆర్ధిక సౌజన్యం అందిస్తున్నారని శివారెడ్డి, చెన్నయ్య వివరించారు.
కామెంట్‌లు