కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పవనసుతునికి మరొక పేరు హనుమంతుడు. హనుమంతుడు అంటే బుద్ధి కలిగిన వాడు రాముడు మంచి బాలుడు అన్నట్లుగా  హనుమంతుడు మంచి బుద్ధి కలిగిన బాలుడు అని చెప్పుకుంటాం  ఈ బుద్ధికి పరిమితి ఉన్నదా  కొన్ని విషయాలు నేర్చుకున్న తరువాత  అక్కడితో ఆగిపోవాలని ఏ మనిషి కోరుకోడు ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకుంటాడు  అతను అనుకున్న ఆ విషయాలు నేర్చుకున్న తర్వాత మరికొన్ని మరికొన్ని అంటూ తన జీవితం మొత్తం నూతన విషయాలను తెలుసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు  అది బుద్ధి లక్షణం. ఆ లక్షణం  హనుమంతుని  ప్రతి కదలికలోనూ మనకు తెలుస్తూనే ఉంటుంది. నిజానికి హనుమంతునికి  చాలా చిన్న పాత్ర  చెప్పుకోవలసిన అంత ప్రాముఖ్యత ఏమీ ఉండదు  కానీ అతని పాత్రను మించిన మరొక పాత్ర మనకు రామాయణంలో కనిపించదు  శ్రీరామచంద్రమూర్తిని మించిన పనులు చేసిన మహానుభావుడు  రామాయణం చదివితే సగం చరిత్ర పదివేల వరకు ఈయన గురించిన ప్రస్తావన ఎక్కడా మనకు రాదు. విశ్రాంతి అయిపోయిన తర్వాత 15-20 నిమిషాల  గడిచేసరికి మనకు ఆయన  ప్రత్యక్షమవుతాడు  పాత్రను ప్రవేశపెట్టడంలో కూడా  ఈనాటి సిని దర్శకులు ఎలాంటి  సందర్భాలను సృష్టిస్తారో కథానాయకుని కోసం  అలా రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రతి పాత్ర  ప్రవేశం మనకు ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. అసలు రామాయణంలో ఆంజనేయునిది పాత్ర ఏమిటి  వాలి సుగ్రీవులలో  వారి తమ్ముడు సుగ్రీవుని  బంటు  అంటే సేవకుడు  వాలి సుగ్రీవుని చంపడానికి సిద్ధమైనప్పుడు  సుగ్రీవుడు తన ప్రాణ రక్షణ కోసం ఎక్కడో దూర ప్రాంతాల  కొండ శిఖరం పైన చేరతాడు  అక్కడకు కూడా వస్తాడు అన్న భయంతో తాను తన పరివారంతో సహా  పరుగు పరుగున వస్తున్న సమయంలో ఆంజనేయ స్వామి మనకు స్వామి ఆగండి అంటూ  ప్రవేశిస్తాడు  వారు ఎవరో  ఇద్దరు వీరులు ఇటు వస్తున్నారు  మనలను చంపడం కోసం అన్న పంపించిన వారై ఉంటారు  కనుక ఈ స్థానాల నుంచి మరొక స్థానానికి వెళ్లడం కోసం  ఇలా చేస్తున్నామని సుగ్రీవుడు చెప్పగానే  అసలు సేవా ధర్మము ఏమిటో మొదట ప్రపంచానికి తెలియజేసిన వాడు ఆంజనేయ స్వామి.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం