కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 బుద్ధిమంతుడైన ఆంజనేయ స్వామి గురించి పరాశరసంహిత  పూర్తి సమాచారాన్ని ఇచ్చింది  దానిలో ఉన్న కొన్ని విషయాలను శ్రీరామారావు గారు మనకు అందించారు  ఆ విషయాలను క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేద్దాం  అంజనాదేవికి వాయుదేవుని వరం వల్ల పుట్టిన వాడు హనుమంతుడు  హనుమ పుట్టడానికి కారణం శివ పార్వతులు అగ్ని వాయువులు కారకులు హనుమంతుని గురువు సూర్య భగవానుడు  సూర్య భగవానుని సంచారం ఆగకుండా  వారి వెంటే వెళ్లి విద్యను నేర్చుకున్నాడు  అంత వేగంగా వెళ్ళగలిగిన  వాయు శక్తి తండ్రి నుంచి సంక్రమించింది అని చెప్తారు  హనుమంతుల వారిని  భృగు మహర్షి శిష్యులు శపించారు అని ఒక కథ ఉంది  వారు శపించడంలో కూడా పరమార్ధం ఉంది. మానవ ప్రకృతి ఎలా ఉంటుందంటే తనకు ఏ  కొంచెం శక్తి ఉన్నా  అది ఎంతో బలంగా భావించి తనంత శక్తివంతుడు మరొకడు లేడు అని చెప్పుకునే  తత్వం  మరి ఆంజనేయ స్వామి బలం ముందు ఎవరు నిలబడగలరు  వారి గురించి తెలిసిన ఎవరైనా వారితో పోటీ పడడానికి వస్తారా  కనక వారికి ఉన్న శక్తి వారికి తెలియకుండా ఉండేలాగా బృహు మహర్షి శిష్యులు శాపం ఇచ్చారు అని ఒక కథనం గౌరవించిన నిందించినా తన శక్తి తాను  గ్రహించగలిగేలా  శక్తిని కూడా ఆ శిష్యుడు  హనుమకు అనుగ్రహించారు  అది శాప పరిహారంగా భావించవచ్చు  హనుమతల్లి సుచలాదేవి మాతామహుడు విశ్వకర్మ  హనుమంతుని మాతామహుడు   కుంజరుడు  సువర్చల తల్లి పేరు  సంధ్యాదేవి  ఛాయాదేవి  ఆంజనేయ స్వామి భార్య   సువర్చలాదేవి. హనుమంతుని బావమరుదులు అశ్విని దేవతలు శనీయముడు  తన వివాహ తిధి జ్యేష్ట శుద్ధ దశమి  వారి తాత అమ్మమ్మ గౌతముడు అహల్య  మేనమామలు శతానందుడు వాలి సుగ్రీవుడు  హనుమంతుడు నిర్వహించిన పదవి సుగ్రీవునికి మంత్రి  ఆయన నిర్వహించిన పదవీ స్థానం రుష్య శ్రుంగ పర్వతం  శ్రీరామచంద్రుని కలవడానికి మొదట హనుమంతుల వారు భిక్షుకగా రూపొందించారు  శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడు మొట్టమొదట పంపా నది తీరంలో చూడడం జరిగింది  ఆ సమయంలోనే హనుమంతుని యొక్క వాక్ నైపుణ్యాన్ని  శ్రీరామచంద్రమూర్తి అంతటివాడే మెచ్చుకున్నాడు  హనుమంతుడు అగ్ని సాక్షిగా శ్రీరామ సుగ్రీవులకు మైత్రి కూర్చాడు.

కామెంట్‌లు