కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు-6302811961.
 జీవితం అంటేనే సమాజంలో కలిసి బ్రతకడం  దానికి కొన్ని నియమాలు  ఉన్నాయి  ఎదుటి మనిషిని కష్టపెట్టకుండా జీవితాన్ని కొనసాగించాలి అంటే  శంకరాచార్యుల వారి గీతలో వారు చెప్పిన మూడు ముక్కలు తెలిస్తే చాలు  నీ పని నీవు చేయి  దానిని కర్మ, నీవు ఏ పని చేస్తున్నావో దానిని తెలుసుకొని చేసిన దాని పేరు  జ్ఞానం, చేయ తగిన పని ఏదో చేయతగాని పని ఏదో అక్కడే తెలిసిపోతుంది కనుక  మంచి పని చేయడానికి పూనుకొని దానిని అంకితభావంతో చేయడం  భక్తి  అలా కాకుండా వీటిలో ఏదో ఒక విషయాన్ని మాత్రమే గ్రహించి అంతటి మించినది మరొకటి లేదు అని భ్రమించి  తామే జీవిత సూత్రాలను  నిర్ధారించి  సామ్రాజ్యాలనే కూల్చినవారు లేకపోలేదు  అందుకే మిడిమిడి జ్ఞానం పనికిరాదు అని మన పెద్దల శుద్ధి
మనం చేసే పని వల్ల మన తత్వం గుణం వల్ల  సమాజంలో గౌరవం ఎదురు వస్తాయి తప్ప  ఊరికే బద్ధకంతో  చాలా పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్న వారిని గురించి ఎవరైనా ఆలోచిస్తారా ఈ ప్రపంచంలో  అందుకే శంకరాచార్యుల వారి గీతలో  గుణ కర్మలను బట్టి గౌరవం వస్తుంది అని చెప్తారు  దానికి ఉదాహరణ చెప్పవలసి వస్తే మనకు నిత్యం అవసరమైన చెప్పులు కొంటాం ఎంతో ఖరీదు పెట్టి  దానిని   బయటే వదిలి లోపలికి వెళతాం. అదే తక్కువ ఖర్చుతో  కొన్న కొబ్బరికాయను తీసుకుని వెళ్లి  మనం ఏ దేవత మూర్తిని కొలుస్తూ ఉన్నామో వారికోసం వినియోగిస్తాం  కనుక శంకరాచార్యుల వారు గీతా వాక్యం గా చెప్పిన దానిని  ఎవరు పాటిస్తారో వారు మాత్రమే  సమాజంలో ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందడానికి అర్హులు  అని తెలుసుకుంటే చాలు.మన పెద్దలు అనుభవ జ్ఞానంతో  మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని గురించి  తన కుటుంబ సభ్యులకు తన సన్నిహిత మిత్రులకు తెలియజేస్తూ ఉంటారు. జీవితంలో ఏవీ మనం అనుకున్నట్టే జరగవు  ప్రకృతి అనుకూలంగా ఉంటే జరుగుతాయి లేకుంటే జరగవు అంత మాత్రం చేత బాధపడుతూ కూర్చుంటే చేయవలసిన పని కూడా చేయలేం  అందుకే వారు  చెప్పే నీతి  రోజులో 24 గంటలు వెలుగే ఉండాలి అంటే కుదురుతుందా  చీకటి కూడా పడుతుంది  ఆ చీకటిలో ఉన్నప్పుడు దానిని భరిస్తే తప్ప రేపటి వెలుగును నీవు చూడలేవు కదా  అలాగే కష్టాలన్నీ కట్టగట్టుకుని శాశ్వతంగా అనుదినం నిన్ను ఇబ్బంది పెట్టవు కదా  ఆనందం కూడా దాని పద్ధతిలో అది వస్తుంది  అంతవరకు లేటు కాకుండా నీవు చేసుకుంటూ వెళ్ళడమే నీ బాధ్యత  అలా మాటల్ని ఆచరణలో పెడితే జీవితంలో మనకు  బాధ అనేది తెలియదు.



కామెంట్‌లు