కదంబం ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అమ్మ పాలు తీసుకువచ్చి  మరగపెట్టి తోడువేసి దానిని పెరుగుగా తయారు చేస్తుంది  పెరుగును నీళ్ళతో కలిపి మజ్జిగ మనకు అందిస్తుంది.  ఆ మజ్జిగలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసునా  చిన్నతనంలోనే ఆ తేడాలను తెలుసుకోవాలి మొదటిది తక్రం. నాలుగో వంతు మాత్రం నీరు పోసి తయారుచేసిన దానిని తక్రము అంటారు  అసలేమి నీరు పోయకుండా చిక్కగా చేసిన దానిని  మద్దితం  అంటారు ఇది చాలా రుచిగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తము కాదు మూడోవ దానిని    ఉదస్విత్తు  అంటారు  ఈ మూడిట్లోనూ పిల్లలకు ఆరోగ్యకరమైనది  తక్రం  కనుకనే అమ్మ దానిని మనకు అందిస్తుంది  బిడ్డల ఆరోగ్యాన్ని చూసేది తల్లి కదా.పిల్లలకు సంబంధించిన రుగ్మతను నివారించడానికి తల్లికి కొని చిట్కాలు తెలిసి ఉండాలి  దానిలో ఒకటి  పరగడుపునే గ్లాసు వేడి నీళ్లలో పసుపు కలిపి తాగితే శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి  దానివల్ల అంతర్గతంగా శరీరం శుభ్రం అవుతుంది  కీళ్ల నొప్పులు వాపులు తగ్గు ముఖం పడతాయి  రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి రక్తంలో గ్లూకోస్ వస్తాయి పెరుగుతాయి మధుమేహం అదుపులో ఉంటుంది  ఇవన్నీ పాటిస్తూ పిల్లలకు అవి ఇచ్చినట్లయితే  వారి ఆరోగ్యం బాగుంటుంది వారి పెరిగిన తర్వాత ఈ చిట్కాలను వారి పిల్లలకు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. నూతన వధూవరులను ఎన్నిక చేసేటప్పుడు  వరునికి  ఎంత ఆస్తి ఉంది  ఏం చేస్తూ ఉంటాడు ఉద్యోగం ఏదైనా ఉందా  అనిఎన్ని లక్షలు సంపాదించగలడు అని ఆలోచిస్తారు తప్ప  అసలు వివాహం చేసుకునే లక్షణాలు అతనిలో ఉన్నాయా లేవా  ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఎవరూ విచారించారు  ఆస్తులు కన్నా ఆప్యాయంగా మనసులను దోచుకునే వ్యక్తులు  కావాలి   అనుకునే రోజులు పోయాయి  నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పే వాడికన్నా చేసి చూపే వాడే మేలు అంటారు  నేను అమ్మను నాన్నను అక్కను చెల్లిని నా సోదరులను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూస్తాను అని కబుర్లు చెప్పేవాడు  చేతల్లో చూపిస్తాడా అన్నది  గమనించినట్లయితే అతని మంచితనం మనకు బయటపడుతుంది.


కామెంట్‌లు