కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 జీవన విధానములో మనం అనుసరించిన పద్ధతులను గురించి  చాలామంది వారి ఇష్టం వచ్చినట్టుగా జీవించటానికి అలవాటు పడతారు  శాస్త్రీయ దృక్పథం అలవాటు చేసుకున్నట్లయితే  వారి జీవన కాలం పెరుగుతుంది  ఉదయం నడక చేయడం చాలా మందికి అలవాటు  కానీ  వైద్యులు చెప్పడం ఉదయపు పూట ఎండలో మనం నడవకూడదు   పైత్య ప్రకృతిని  ఆ ఎండ  సాయంత్రం, ఎండలో నడవడం వల్ల డి విటమిన్ శరీరానికి వస్తుంది  కనుక నడవాలనుకున్న వారు ఉదయం కాకుండా సాయంత్రం నడవడం ఆరోగ్యానికి మంచిది  స్మశానంలో శవాన్ని కాల్చిన  గాలిని పీల్చవద్దు ఆరోగ్యం చెడిపోతుంది అంటారు. యజ్ఞ యాగాదులలో వచ్చిన  వాసనను పెంచడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది.
దాసి అనే  శబ్దాన్ని పనిచేసే అమ్మాయిగా కాకుండా  నీ కన్నా వయసులో పెద్దది అని చెప్పడం కోసం  దాసీ సంగమం అన్నాడు  నీ కన్నా పెద్ద వయసులో నా స్నేహితులతో సంగమించవద్దు అని చెప్పడం  అలాగే బాల  అంటే నీ కన్నా వయసులో చిన్నది అని అర్థం బాల అంటే ఎనిమిది సంవత్సరాల  బాలిక   అని కాదు  చెరువులలో నిల్వ ఉన్న మంచినీటిని తాగవద్దు అని చెప్తున్నాడు  ఒకే చోట నిల్వ ఉండటం వల్ల అనేక రకాల జీవరాసులు దానిలో కొన్ని మరణించేవి ఉంటాయి  అది మానవ శరీరానికి  అపకారం చేస్తుంది తప్ప ఉపకారం చేయదు  అందులో అందరూ  కాళ్లు కడిగి తమ  బిందెలను కడిగి నీరు పట్టుకుంటారు  దాని క్రిములను కూడా దానిలోనే ఉంటాయి  కనుక ఆ నీటిని మంచినీరుగా త్రాగవద్దు అని చెప్తున్నాడు. మరి మంచినీటిని దేనిని వాడాలి అన్నప్పుడు  జలం ప్రవహిస్తూ ఉన్న వాటిని మాత్రమే  వాడాలి  ఈ విషయాలన్నీ తెలియజేస్తూ రాత్రి  భోజనాలలో పెరుగు వాడవద్దు మజ్జిగ అని చెప్తూ ఉంటాడు  పెద్దలు చెప్పిన ఈ విషయాలను అన్నిటిని  శ్రద్ధగా  పిల్లలకు తల్లి పాఠాలు చెప్పినట్లుగా చెప్పగలిగితే  వారి జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుంది  ఆరోగ్యం వారి సొంతం అవుతుంది  వీటన్నిటిని మించి ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది అతని జీవితంలో  ఫలానా వారి అబ్బాయి ఫలానా వారి అమ్మాయి  అని    పిల్లల మంచితనాన్ని గురించి ఇతరులు చెప్పుకుంటూ ఉంటే ఆ తల్లి మనసు ఎంత ఆనందంతో  ఉబ్బితబ్బిబయి పోతుందో  అనుభవించే ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. అలా చేస్తారు కదూ...

.

కామెంట్‌లు