కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పాప పుణ్యాలను గురించి మానవ జీవనసరాళిని తెలియజేస్తూ  ప్రతి ప్రవక్త కొన్ని సూక్తులు మనకు అందించారు  పాపం చేస్తూ దానివల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించవచ్చునన్న దురాశతో క్షణిక ఆనందానికి లోనై  సుఖ బ్రాంతిని పొందుతారు  కానీ మనం మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం వస్తుందని తెలియజేసిన పెద్దల సూక్తిని అనుసరించి  ఇతను  ఏ చెడ్డ పని చేశాడో దానికి తగిన మోతాదులో దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తూనే ఉంటాడు  ఆ పాప ఫలితాన్ని అనుభవించేటప్పుడు మాత్రం  జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందని ఆశ్చర్యపోక తప్పదు  చేసేటప్పుడు ఎంత సుఖాన్ని అనుభవించాడు  ఫలితాన్ని అనుభవించేటప్పుడు  అంత బాగానే కూడా అనుభవిస్తాడని  కర్మ సిద్ధాంతంగా గౌతమ బుద్ధుల వారు చెప్పిన వాక్యం. చేతకాని వారికి చరిత్ర ఒక పుస్తకం లాగా కనిపిస్తుంది  ఏదైనా సాధించాలనుకున్న వారికి మార్గ నిర్దేశకంగా కనిపిస్తుంది  పుస్తకం అంటే అక్షరాలతో కూడినది మాత్రమే కాదు  చరిత్ర తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసి  శాయశక్తుల తన ప్రతి  అంశాన్ని పరిశీలించి  శివనాగి రెడ్డి గారి లాంటి చరిత్రకారులు మనకు ఎన్నో పుస్తకాలు  అందించారు  అందుకే వాటిని మార్గదర్శకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం  రెడ్డిగారు ఈ కార్యక్రమాలను విశ్లేషించి ప్రజలకు చెప్పాలన్న లక్ష్యంతో  అది  పూర్తి అయ్యేంతవరకు కూడా  అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి ఒక్కరూ నీతులు చెప్పేవాళ్లే  రెడ్డిగారూ ఎందుకు అంత కష్టపడడం అంటూ  అది ఫలించి దాని ఫలాలు అందినప్పుడు దానిని అనుభవించేది  ఈ విమర్శించిన వారు మాత్రమే
మానవ ప్రయత్నాలను మూడు రకాలుగా విభజించాడు మహాకవి  భతృహరి. ఒక కార్యాన్ని ప్రారంభించాలని  అనుకొని దాని వల్ల వచ్చే కష్టాలు, నష్టాలు ఊహించుకొని  ఇది మనం చేయలేమని ప్రారంభంలోనే వదిలేసిన   పద్ధతిని అధమం అని ఎన్ని కష్టాలకైనా వచ్చి మనం దీనిని సాధించాలి అని ప్రయత్నం చేసి మధ్యలో వచ్చిన కొన్ని వేసిన వాడిని  ప్రయత్నాన్ని మధ్యమ  ప్రయత్నమని  ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని  తాను చేయదలుచుకున్న పనిని పూర్తి చేసిన వాడిని ఉత్తమ  కార్యనిర్వాహకుడు అని  విభజించాడు  ఇవాళ అనేక విషయాలను గురించి  ఆలోచించి ప్రయత్నించి దానిలో ఎన్నో కష్టాలను అనుగ్రహించి కొన్ని సందర్భాలలో  ప్రాణాపాయాలను కూడా  లెక్కించకుండా  ఈరోజు అనేక చారిత్రక విషయాలను వెలికి తీసి  ఇది మన చరిత్ర అని  తెలియజేస్తున్న  శివ నాగిరెడ్డి గారి ప్రయత్నం ఇలాంటిది అని నా అభిప్రాయం  వీరు చేసిన ఫలితాలను అక్కడితో ఆపకుండా ఇంకా ముందు కూడా  అనేక భూగర్భంలో కలిసిపోయిన రహస్యాలు బయటకు తీసి మనకు అందిస్తారని ఆశిస్తూ  వారికి అభినందనలు తెలియజేస్తున్నాను.



కామెంట్‌లు