కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆనాటి విద్యార్థులకు ఈనాటి విద్యార్థులకు  నడకలోనూ  నడత లోను  కూడా ఆభేదాన్ని మనం చూడవచ్చు  ఓ నమాలు మనతో దిద్దించిన ఆనాటి ఉపాధ్యాయులు ఎక్కడైనా కనిపించినప్పుడు  మనకున్న పిచ్చి అలవాట్లలో పొగపిల్చడం  మొదటిది  వారు కనిపించిన మరుక్షణం  ఆ కాలుస్తున్న సిగరెట్ గాని బీడీ కానీ వారికి తెలియకుండా  దూరంగా విసిరి వేసే స్థితి  దానికి విరుద్ధంగా ఈరోజు నీవు ఒక  మంచి ఖరీదైన సిగరెట్టు కాలుస్తూ ఉంటే గురువు కనిపిస్తే ఇదిగో ఒకటి తీసుకోండి మాస్టారు మీరు కూడా కాల్చండి అనే స్థితికి వచ్చాడు అది  పెరగటమో తరగడమో  మనం ఆలోచించలేకపోతున్నాం  దీనికి కారణాలు అనేకం.
చదవడం ఈరోజు భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా చదువుతూ  పెద్దపెద్ద డిగ్రీలను తెచ్చుకోవడం మాత్రం మనం చూస్తున్నాం  కానీ అలాంటి వారిని ఒకసారి మనం కదిలిస్తే  వాడి జ్ఞానం ఎంత తక్కువగా ఉందో మనకు తెలుస్తుంది  ఇవాళ జీవన విధానంలో ఇంటిని గురించి చెప్పవలసి వస్తే  ఇంత క్రితం వారికి సరిపడిన ఇంటిని ఏర్పాటు చేసుకొని  దానికి తగిన సౌకర్యాలను  కల్పించుకునేవారు  ఇవాళ భార్యాభర్త ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె గాని ఉన్న కుటుంబం కూడా  ముగ్గురికి మూడు గదులు ఉండాలి  వారి మధ్యలో స్నేహితుడు కానీ చుట్టాలు గాని వచ్చినప్పుడు వారికోసం మరొక గది ఉండాలి  వీరంతా కలిసి మాట్లాడుకోవడానికి ఇంకొక గది ఉండాలి  వంటగది లాంటివి మామూలే.
నాటి సామాన్య మానవుడు  తక్కువ జీతంతో  భార్యా పిల్లలతో ఎంతో సుఖంగా ఆనందంగా కాపురం చేస్తూ ఉండేవాడు  అంతా కలిసి ఒకసారి భోజనం చేయడం  ముగ్గురు నలుగురు కలిసి ఆ కుటుంబ సభ్యులు అంతా  కూర్చునే సరదాగా కాలక్షేపం చేయడం  ఆ ఇంటిలో ఏ పని వచ్చినా అంతా కలిసి ఊకుమ్మడిగా చేయడం  వల్ల ప్రశాంతంగా శాంతియుతంగా జీవితాలు గడుస్తూ ఉండేవి  ఈరోజు విపరీతమైన జీతాలు  లక్షల్లో ఉంటాయి  దానికి తగినట్లుగా బంగాళాలో ఉండాలి  కారు ఉండాలి ఏసి ఉండాలి తనకు కావలసిన పరిచారికలు ఉండాలి  దానికి  సరిపడిన వస్త్రధారణ  ఆ కుటుంబంలో ఎవరి పని వారిదే తప్ప ఎవరు ఏ పని చేస్తున్నారో రెండో వాడికి తెలియదు  ఆ జీతం తీసుకుంటున్నాయన  తన విద్య నిర్వహణ కోసం వెళ్లిపోవడం జరుగుతుంది ఆ ఇంటి గృహిణి వేరే సమావేశాలు సభలు వనితా వాణి కార్యక్రమాలు అంటూ వెళుతుంది. ఇదీ పరిస్థితి.


కామెంట్‌లు