కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మనం చనిపోతే అయ్యో పాపం చనిపోయాడా అంత మంచి మనిషి ఇంత త్వరగా చనిపోవడం ఏమిటి అని  ప్రజలు అనుకోవాలి తప్ప పోతే పోయాడు సగం ఫీడా వదిలిపోయింది ఒక రాక్షసుడు ఈ సమాజం నుంచి దూరం అయ్యాడు  అనుకునే స్థితి తీసుకురావద్దు  అలా జరగాలంటే నీ జీవితంలో ఎలాంటి పొరపుచ్చాలు లేకుండా  ఎవరికి కష్టం కలిగించకుండా  జీవితాన్ని క్రమబద్ధంగా నడుపుకోవడమే మార్గం  అలాంటి జీవితాన్ని మనం ఎందుకు కొనసాగించకూడదు అని ఆలోచన చేసే  మంచిని సంపాదించుకుంటూ చక్కని పేరుని తెచ్చుకున్నట్లైతే  నీకు నీ వంశానికి కీర్తి ప్రతిష్టలు మిగులుతాయి  లేకుంటే రావణాసురునికి పట్టిన గతే మనకు పట్టే అవకాశం ఉంది అని మాత్రం మరిచిపోవద్దు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు  మనకు చెప్పే మొదటి పాఠం  నీవు ఆస్తి పాస్తులు ఎంత సంపాదించినా  ప్రతి వస్తువు కొనగలిగిన స్థితి ఉన్న  దానిని తినగలిగే ఆరోగ్యం నీ సొంతం  కానప్పుడు ఆ మొత్తం వృధా అవుతుంది  కనుక నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీ మీదే ఉంది  ఎవరో వేరే వచ్చి ఏ ఒక్కరు నీకు ఈ విషయంలో సాయం చేయరు  నీవు ఆస్తి సంపాదించడం అంటే ఆరోగ్యాన్ని సంపాదించడం అని అర్థం  దానితో ఎంత సంతోషంగా ఉంటావో నీకు  అనుభవిస్తే తప్ప తెలియదు  నీవు ఎప్పుడైనా సమస్యలలో చిక్కుకున్నప్పుడు  ఆ చిక్కులను విడిపించే తాళం చెవి ఈ సంతోషం  అన్న విషయాన్ని మర్చిపోవద్దు  కనుక ఆరోగ్యాన్ని కాపాడుకో  అనే అమ్మ అనుక్షణం బిడ్డలకు చెబుతూ ఉండాలి. చిన్నపిల్లలు ఆటకాయితనంగా బావి దగ్గరకు వెళ్లి  తాబేలు ఎప్పుడు పైకి వస్తుందా దాన్ని ఎప్పుడు చూద్దామా అని ముచ్చట పడతారు అది బయటకు వచ్చి తల మాత్రం బయటకు పెట్టి కాడికి పిలుచుకొని తిరిగి ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది దాని కార్యక్రమాలు చూసి పిల్లలు ఎంతో ఆనందిస్తారు  అయితే దీనివల్ల నేర్చుకోవలసినది ఏమిటి అది దాని సహజ లక్షణం కదా అనిపించవచ్చు ఇవాళ దేశంలో యోగ  ప్రతి ఇంటిలోనూ వ్యాప్తి చెందింది దానికి కారణం తాబేలు  యోగాలో ఏం చెప్తారు పంచంద్రియాలను తన స్వాధీనం చేసుకుని కేంద్రీకృతం చేసి ఏ విషయాన్ని గురించి నీవు చేయ తలుచుకున్నావో ఆ విషయాన్ని గురించి తపస్సు చేయి అని చెబుతారు  మరి ఆ తాబేలుకు ఎవరు చెప్పారు.

కామెంట్‌లు