పాకాలలో 7 న రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్- పోస్టర్ ఆవిష్కరణ
 పాకాలలో మొట్టమొదటి సారిగా రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ ఏప్రిల్ 7 వ తేదీన జరగనుందని, ఈ గొప్ప అవకాశాన్ని క్రీడాకారులకు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాటశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ రఫి అన్నారు. పాకాల ప్లాటినం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న  ఈ చెస్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆయన మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెస్ ద్వారా విద్యార్థులు శక్తివంతులు అవుతారని వివరించారు. పాకాల ప్లాటినం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మారసాని విజయబాబు మాట్లాడుతూ తిరుపతి చెస్ అసోసియేషన్, మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి  చెస్ టోర్నమెంట్, ఏప్రిల్ 7 వ తేదీ ఆదివారం, ఉ.9 గం.
పాకాల గవర్నమెంట్ హై స్కూల్ లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. అన్ని వయసుల చెస్ క్రీడాకారులు పాల్గొన వచ్చునని అన్నారు. నగదు బహుమతులు మొత్తం విలువ 50,000 వేల రూపాయలు పేర్కొన్నారు. వివిధ కేటగిరీల లో 52 మంది విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, సర్టిఫికెట్స్, అలాగే మరో 20 మంది విజేతలకు ట్రోఫిలు, సర్టిఫికెట్స్ బహూకరించనున్నట్టు వివరించారు. దీనితో పాటు క్రీడాకారులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేశామన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ పేర్లను క్రింద కనపరచిన link  ద్వారా apchess.org నందు నమోదు చేసుకోవాలని కోరారు.
మరిన్ని వివరాలకు, నిర్వాహకులు విజయ బాబు 8143337722, మహేష్ బాబు 9701401492 నంబర్లకు ఫోన్ చేయాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దంత వైద్యశాల డాక్టర్ భువీందర్, బాలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు