ఉగాది ;-:వర్షిత-9వ‌,తరగతి-జి.ప.ఉ.పా .రామంచ
 కొత్త సంవత్సరం వచ్చింది 
కొత్త ఆనందాలు తెచ్చింది
మామిడి చెట్లు కాత కాచింది
వేప చెట్టు పూత పూచింది 
పల్లె అంత పచ్చని వనంగా మెరిసింది
కొమ్మల్లో కోయిల కూత కూసింది
మనలోని అజ్ఞానాన్ని తొలగించింది
విజ్ఞానాన్ని అందించింది
వసంత రుతువువచ్చింది
మల్లెచెట్టు విరబూసింది
గడపగడపకు ఉగాది స్వాగతం పలికింది
చుట్టాలతో ఇల్లంతా కళకళలాడింది
ఆరు రుచులతో  వచ్చింది ఉగాది
మరపురాని ఆనందాన్ని తెచ్చింది
ఉగాది పచ్చడి తాగేద్దాం
ఉల్లాసంగా ఉరకలు వేద్దాం
క్రోధి సంవత్సరానికి స్వాగతంతో, అందరికి
ఉగాది శుభాకాంక్షలు
కామెంట్‌లు