బెంగ తీరిన జింక;- (బాల గేయం)-మమత ఐలకరీంనగర్9247593432
అందమైన జింకొకటి అడవినందున
ప్రతి చిన్న జీవికైన బెదురు చెండెను
తోటి జింకలన్ని కూడ పిరికి పందగా
పేరుపెట్టి గేలిచేసి పిలువ సాగిరి

ఒకరోజు కుందేలుతొ మాట కలుపుచు
తనబాధను పంచుకొని చింత చెందెను
వినయంగా పలకరించమనుచు చెప్పెను
చిన్న పెద్దలందరిని ప్రేమతోడను

కుందేలు సలహాతో ముందుకెళ్లగా
చెరువు లోన కొంగలన్ని ఆడుచుండెను
మాట కలిపి కొంగలను పాలమాదిరి
ఉన్నారు మీరనుచు పొగడ సాగగా 
సంతసంతొ అవికూడా ముచ్చటించెను

ఇంకొంత ముందుకేగ కలిసెనేనుగు
వందనాల తోడ జింక క్షేమమడగగన్
సంతసించి బాగోగులు జింకనడిగెను
పిరికి తనంపోయి జింక చెంగుచెంగున
తలనెత్తుక బ్రతుకు చుండె తోటి వారితో


కామెంట్‌లు