అమ్మ ప్రేమ(బాలగేయం)-మమత ఐలకరీంనగర్9247593432
ఆశమాష కాదురబై అమ్మ అంటెను
అమ్మ ప్రేమచూడరనీ వావు గుణమున
నీ ఆకలి తీర్చెదనని నిజము జెప్పుచు
పులితోటి వాదులాడె దూడ కోసము

మేత మేసుకుంటు బోయి అడవి లోనికి
ఏమరుపాటున జిక్కె వ్యాఘ్రంబునకు
చంపబోతె ఆగుమని సర్ది చెప్పుచు
పాడి యావు ఏడ్చుచుండె దూడ కోసము

దుఃఖ బాధ తోడ ఆవు వాదులాడగా
నచ్చి సమయమిత్తుననె పుండరీకము
దండంబును బెట్టెనావు దయా గుణముకు
గడువు లోన వచ్చెదననె విడచి నందుకు 

దూడ వద్ద కేగి ఆవు పాలనిచ్చుచు
క్రమశిక్షణలాటుపోట్లు నేర్పుచుండెను
పొదల మాటుకెళ్ళద్దని మంచి చెడ్డలు
చెప్పి ఆవు వెళ్ళుచుండె పులిని చేరను

మాటనిచ్చి తప్పకుండ వచ్చిన ఆవు
నీ యాకలి దీర్తునని నిలిచె ముంగిట
ఆశ్చర్యంతోడ పులి ఆవును జూసి
దైవమేమొ అనుకొచు దారినిచ్చెను


కామెంట్‌లు