ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 తరువాత కాలంలో పలనాటి యుద్ధం సినిమా జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ బాధ్యత నాకు అప్పగించారు నిర్మాత వీరయ్య గారు దాదాపు రెండు నెలల పరిచయం  రామారావు గారిని నాకు మరింత సన్నిహితం చేసింది  ఆకాశవాణిలో బఫూన్గా పిలవబడే సలాది కనకారావు రామారావు గారి కాళ్ళకు నమస్కారం చేసి అన్నగారూ నేను మీ ఇంటికి వచ్చి మీ దర్శనం చేసుకున్నాను మీరు నన్ను ఆశీర్వదించారు కూడా నన్ను మీరు గుర్తించారు  నేను సలాది కనకారావుని అన్నాడు హొయలు వలకబోస్తూ  బ్రదర్ మిమ్మల్ని చూసాం మీతో పాటు విజయవాడ నుంచి మరికొందరు వచ్చారు కదా అనేసరికి ఆశ్చర్య పోవడం కనకారావు  వంతు అయ్యింది  రామారావు గారు అన్నగారు మీరు నాటకం వేస్తున్నారని తెలిసింది ఎన్ని పాసులు ఇస్తారో
మీరు ఎన్ని ఎక్కువయిస్తే అంత ఎక్కువమంది వచ్చి మీ కార్యక్రమాన్ని చూస్తాం అనగానే రామారావు గారు సహజమైన తన చిరునవ్వుతో చూడండి కనకారావు గారు ఇది నా నాటకం కాదు దేశం కోసం  ప్రదర్శిస్తున్నాము  దీనిలో మాకు వచ్చేదేమీ లేదు ఇది వ్యాపార నాటకం కాదు  లేకపోతే  వంద రూపాయలు  మీరు ఎన్ని తీసుకుంటే  అంతమంది ఎక్కువ మంది బాధితులకు చేరుతుంది  చెప్పండి బ్రదర్ అండ్ ఇవ్వను అనగానే అన్నగారు హాస్యం ఆడుతున్నారు అన్నాడు బిక్క చచ్చి హాస్యం కాదు బ్రదర్ చెప్పండి ఇప్పుడే ఇస్తా అంటూ ముందుకు సాగారు రామారావు గారు  అలా చక్కటి స్మృతిని మిగిల్చిన రామారావు గారు ఆశీస్సులు తీసుకొని తనతో వచ్చిన నటి దేవికను వెంటబెట్టుకొని స్టేడియంకు  వెళ్లిపోయారు.
మాతో ఫోటో దిగారు.అలాంటి మంచి అనుభవాన్ని మేమంతా పొందితే ఆకాశవాణి సంచాలకుల నుంచి మెమో తీసుకున్న కనకరావుకు మాత్రం చేదు అనుభవం మిగిలింది. 1964 వ సంవత్సరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం మంచి ఉచ్యస్థితిలో ఉంది  అటు బండ్ల బుచ్చిబాబు ఆమంచర్ల గోపాలరావు లాంటి దిగ్గజాలు  ఇటు నండూరి సుబ్బారావు, సి
రామ్మోహన్రావు, ఎం నాగరత్నమ్మ, ఏబి ఆనంద్, లింగరాజు శర్మ ఏ కమల కుమారి కనకదుర్గ లాంటి నటులతో చక్కటి కార్యక్రమాల్ని  ఆంధ్రదేశానికి అందించింది అప్పుడే కొత్తగా హైదరాబాదు నుంచి పురాణ సూర్యప్రకాశదీక్షితులు గారు   ఉషశ్రీ అన్న  మారుపేరుతో ఘనాపాటి విజయవాడ కేంద్రంలో ప్రవేశించారు  1964 లో ప్రధాన మంత్రి  జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ఉషశ్రీ గారు ఆ మరణ వార్త ఆంధ్రప్రజలకు అందించడం అప్పటి తరానికి గుర్తు ఉండి ఉంటుంది. అనౌన్సర్ గా ఉషశ్రీ గారు ప్రవర్తించిన సందర్భం అదొక్కటే.

కామెంట్‌లు