ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 నాటకంలో బందా గారు ఉన్నారు అంటే ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొనేవారు నవరసాలను ఆయా సందర్భాలలోనూ ప్రదర్శించి మెప్పించాడు ఆయన రాగయుక్తంగా పాడి పరీక్షకులను ఆకట్టుకునేవారు బందా గారు ఏ నాటకం వేసిన ఆయన ఉన్నాడని తెలిస్తే మంచి నటన పద్యాలు డైలాగులు ఉంటాయని జనం తండోపతండాలుగా నాటకం చూడ్డానికి వచ్చేవారు ఇక బందరు కర్ణుడు ప్రతాపరుద్రుడు కన్యాశుల్కంలో గిరిశం అల్లూరి సీతారామరాజు కూడా చేసి గొప్ప నటుడు అని అనిపించుకున్నారు  తెలుగు సినిమాలలో కృష్ణుడుగా మొదట  వేసిన వారు ఈలపాట రఘురామయ్య రెండో వారు బందా కనక లింగేశ్వర రావు గారే తదుపరి కాలంలో చాలామంది నటులు సినిమాలలో కృష్ణ పాత్రను ధరించారు  తరువాత ఆ పాత్రకు ఎన్టీ రామారావు గారు  అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందారు.పాత తరం సినిమాలలో బందా గారు కనిపిస్తారు ఆయన బాలనాగమ్మ ద్రౌపది మాన సంరక్షణ పాదుకాపట్టాభిషేకం సారంగధర సినిమాలలో నటించారు  వారిద్దరూ ద్రౌపది  సంరక్షణలో కృష్ణ పాత్రను ధరించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆయన నటనకు ప్రశంసలు కురిపిస్తూ కురుపాం జమీందారు గారు అఖిల భారత కృష్ణ అన్న బిరుదును ప్రదానం చేశారు అలాగే జైపురం మహారాజు నటశేఖర బిరుదుతో సత్కరించారు వారు 1964 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు నందుకున్నారు వారు ప్రదర్శించిన ఉత్తమ నటనకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ బిరుదును అందుకున్నారు. ఆయనకు భక్తి ఎక్కువ గుప్త దానాలు చేయడంలోనే ముందు ఉండేవారు. తమ స్వగ్రామమైన ఆటపాకలో శివాలయాన్ని నిర్మించారు అదే గ్రామంలో ఒక చెరువును త్రవించారు ప్రజల చేత అనేక సంస్థల చేత ప్రశంసలతో పాటు ఘన సన్మానాలను అందుకున్న కనక లింగేశ్వర రావు గారు 1968 డిసెంబర్ 3న ప్రేక్షకులను దుఃఖ సాగరంలో ముంచి భౌతికంగా మనకు దూరమయ్యారు  వారి మరణానంతరం ఆటపాకలో ఆయన నిర్మించిన శివాలయం ఎదురుగా బందా గారి విగ్రహాన్ని ప్రజలు ఏర్పాటు చేసి ఆయన పట్ల భక్తి గౌరవాలను చాటుకున్నారు  ఆయన శిష్యునిగా అనేక నాటకాలు  వారి ద్వారా రేడియోలో  పేరు రావడానికి కారకుడైన  పితృత్యులు బందా కనక లింగేశ్వర రావు గారిని స్మరించుకోవడం  నాకెంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

కామెంట్‌లు