ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 ఏ వైద్యుడు చెప్పినా దుంప కూరలను తక్కువ తినమని చెప్తాడు  ప్రత్యేకించి చక్కెర వ్యాధిగ్రస్తులకు  ఈ నియమం పాటించమని చెప్పడం  బాధ్యతగా పాటిస్తారు  అయితే ఇక్కడ ఉపయోగాలు గురించి పెద్దలు చెప్పేదేమిటంటే గుండె ఆరోగ్యానికి క్షేమకరం బాగా పనిచేస్తాయి అని  తీసుకుంటే గుండెలో రక్త ప్రసరణ మెరుగుతుంది రోగనిరోధక శక్తిని  పెంచుతాయి  చక్కెర పెరుగుదలను ఈ దుంపలు నియంత్రిస్తాయి  బరువు తగ్గటానికి కూడా ఈ దుంపలు బాగా ఉపయోగపడతాయి  ఉదర సంబంధమైన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు  ఎక్కువగా తిన్నవారు   కంటి చూపును మెరుగుపరుచుకుంటారు  ఇన్ని లాభాలు ఉన్నా  చామకూరను తినకపోతే ఎలా? చామకూర అనగానే  సాహిత్య రంగంలో ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది ఎవరికైనా. ఆ రోజుల్లో  కుల వ్యవస్థను బాగా పట్టించుకునేవారు  ప్రత్యేకించి కవి కలం పట్టాలి అంటే అతనికి జంజం ఉండి తీరాలి  ఆ రోజులలో చామకూర వెంకట కవి విజయ విలాసం అన్న పేరుతో అర్జునుడు  తాను చేసిన తప్పుకు పరిహారంగా అశ్వమేధ యాగం చేస్తూ అన్ని ప్రాంతాలను తిరిగి మూడు వివాహాలను చేసుకోవడం  కథా వస్తువు  ఆ గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కరూ చామకూర పాకానపడింది అని అభినందించినవారు ఒక్కడు తప్ప. ఆ గ్రంథానికి  కావ్య గౌరవం దక్కదు అని చెప్పిన ఏకైక పండితుడు  అనేక గ్రంథాలు రాసిన వాడు  వేదం వెంకటరాయ శాస్త్రి గారు  సనాతన ధర్మాన్ని అక్షరాలా పాటిస్తూ జీవితాన్ని  కొనసాగిస్తున్న ఛాందసుడు. ఛాందసుడు అంటే ఆ రోజుల్లో  అర్థం  పద్యాలు రాసేటప్పుడు  చెందో నియమాలను పాటించిన వాడు అని  ఆయన మరణించిన తరువాత ఆయన వ్యాఖ్య చదివిన  తాతాజీ  పేరుతో ఉన్న తాపీ ధర్మారావు గారు  విజయ విలాసాని పాఠం చేసి  విశ్లేషణాత్మక  గ్రంథం రాసి విశాలాంధ్ర వాడు ప్రచురించగా  వారికి కళా ప్రపూర్ణ బిరుదు కూడా  వచ్చింది  వీరు కాపు కులస్తులు  వెంకట కవి గారు కూడా కాపులే  వీరు మద్రాసు వెళ్లి  వేదం వారి కుటుంబంలో  కవిత్వం రాస్తున్న అదే పేరుతో ఉన్న మనమడిని  కలిసి  ఏమయ్యా మీ తాతగారు మా తాత గారిని తిట్టడం సమంజసమేనా  బ్రాహ్మణులు తప్ప కలం పట్టడానికి ఎవరికీ అర్హత లేదా  నేను కలం పట్టి డాక్టరేట్ సంపాదించాను మరి మీ తాత ఏం సంపాదించాడు అన్నాడు.
కామెంట్‌లు