మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 శ్రీవారి కొండంతయు శేషాంశ మనియు అందువలన వైష్ణవ మతోద్ధరకుడైన శ్రీ రామానుజుల వారి కొరత కూడా దాని మోకాళ్ళకు నడిచి వెళుతూ మార్గంలో  అలసి కొంచెం సేపు ఆగిన ప్రదేశమున శ్రీ బాష్యకార్ల వారి గుడి కట్టబడినది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు చేరినది ప్రతి దినము ఇచ్చట నుండి నివేదన వచ్చును.
ఇక్కడ శ్రీవారి ముడుపులు ఇవ్వకూడదు వారికి కానుకలు మొదలగునవి ఇవ్వవలెనంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో  పారుపత్యదారు ఖచేరిలో చెల్లించాలి గాని ఇచట ఇవ్వకూడదు అలిపిరి వద్ద నిండా పురాతనమైన గోపురం ఉన్నది. ఇది శిథిలమైనందున ఎవరు  దగ్గరకు పోకుండా చుట్టూ దూరముగా కటంజనము  వేయబడినది. ఈ గోపురం అందరి ప్రాచీన శిల్పాలను  భద్రంగా కాపాడబడుతూ ఉన్నాయి  ఇది అలిపిరి రాస్తాలో అలిపిరి వద్ద నుంచి ఒక మైలు దూరంలో ఉంది అలిపిరి నుంచి గాలిగోపురానికి మార్గం నిండా  ఎప్పుడు యాత్రికులకు కష్టంగా ఉంటుంది ఈ గోపురం చాలా దూరానికి కనపడుతుంది కూడా  రాత్రులందు గాలిగోపురము  వరకు మార్గములను గోపురము పై భాగములోను దేవస్థానం వారు దీపములు వేయించెదరు కానీ  ఆ దీపము చాలా దూరం కనపడును.ఈ గోపరముల చేరి ఒక మఠం కలదు.దీనిని గాలిగోపురం మఠం అనీయు వైకుంఠ దర్వాజా మఠం అనీయు వాడెదరు ఇచ్చట కొందరు ఉత్తర హిందుస్థాన్ సాధువులు ఉన్నారు  ఈ మఠము తిరుపతిలోనూ కలదు తిరుపతిలో ఒక కట్టడం ఉంది బాష్య కార్ల వారి దేవస్థానము దాటిన తర్వాత కొన్ని గజముల దూరంలో తీర్చినట్లుగా శిలలు ఉన్నాయి. ఆ పెట్టెలకు నాలుగు ప్రక్కల ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి  శ్రీ పద్మావతి అమ్మవారు సారె తెచ్చుకొనుచు అక్కడికి రాగా ఆమెకు కోపము వచ్చినందున ఆ పెట్టెలు అచట నుంచి ఆంజనేయులను కావలి పెట్టి పద్మసరోవరమునకు వెళ్ళినట్టు చెప్పారు  కోపమునకు కారణము పలు విధములు అని చెప్పెదరు.




కామెంట్‌లు