మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 యాత్రీకుల పసిపిల్లలకు ఆవుపాలను ఉచితంగా ఇచ్చే పథకం అమలులో ఉండేది భక్తులను విషపురుగు కలిస్తే యానాదులు మూలిక మందులు ఇచ్చే వాళ్ళు యానాదులను  ఇళ్లోల్లు అని కూడా పిలుస్తారు వందలాదియానాదులు తిరుమల ఊరి శివారులలోని గుడిసెలలో నివాసం అంటూ యాత్రికులను కనిపెట్టుకొని ఉండేవారు దేశాంతరుల మల ముద్రాడులను ఎత్తిపారేస్తూ తిరుమల పరిశుభ్రంగా ఉంచడంలోనూ  ఏమైనా బరువులు భర్తీలు మోయడం లోనూ తీర్థాలకు దారి డొంకా చూపటం లోనూ దేవుడి గుడికి కావలసిన కట్లను నరికి తేవటంలోనూ అడవి ఉత్పత్తులైన తేనే మైనం కరక నెల్లి నరమామిడి చెక్క సేకరణ లోను యానాదుడదే ప్రాముఖ్యత సర్వేకు వచ్చిన వితిన్ సన్ మొదలగు బ్రిటిష్ అధికారులు యానాదుల ఉనికిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశం మొత్తం నుంచి వచ్చే యాత్రికులకు దక్షణాయ స్థలాలు అయినందువల్ల తిరుపతి తిరుమల లో బిక్షగాళ్ల బెడద ఎక్కువగా ఉంది గుడికి వచ్చే భక్తులు ఎంతో కొంత దానం చేయకపోతారా అని యాచకులు ఎదురుచూస్తూ ఉండేవాళ్లు గుళ్ల ముంగిటే కాకుండా ఇండ్ల దగ్గరికి వచ్చి అడుక్కునేవాళ్లు వీరిలో నిజమైన సాధువులు ఎవరో పగటివేషగాళ్ళు ఎవరో తెలిసేది కాదు కుంటి గుడ్డి ముసలి ముసుగులో లేని వాళ్ళు రోగ పీడితులు కొన్నిసార్లు కాళ్లపై బట్టలు కప్పుకొని కాళ్లు పోయాయి ధర్మం చేయండి  అని చేయి చాచే మోసగాళ్లు బిచ్చగాళ్ళలో ఉండేవారు  తిరుమల నడకదారి అంతా ఈ బాధ ఎక్కువ ముఖ్యంగా అలిపిరి నుంచి కొత్త గోపురం వరకు వరుసగా బిచ్చగాళ్ళు బార్లు తిరేవారు బిక్షగాళ్లతో ఒక ప్రక్క ఏగుతూ ఉంటే మరొక ప్రక్క కోతుల గోల కొబ్బరి చిప్పలు అరటి పండ్లు ప్రసాదాలను  అమాంతం లాక్కునేవి అదిలించినా బెదరవు. తమకదో ప్రత్యేక హక్కు ఉన్నట్లు గడబిడ చేస్తాయి. టీటీడీ వచ్చాక తిరుమల కొండపై బిక్షకు నిషేధం విధించింది అంతేకాదు మద్య మాంసాదులు వినియోగించకూడదని తీర్మానించింది కోతులను బట్టి దూరంగా విడిచిపొచ్చి యాత్రికులకు ఊరాటనిచ్చింది 19వ శతాబ్దంలో కాశి యాత్రకు పోతూ తిరుపతి వచ్చిన ఏనుగుల వీరాస్వామి  సైతం కోతుల బెడదని పేర్కొన్నారు గాలికాలం ఒకటి ఉండేది ముఖ్యంగా అక్కడి వాతావరణ పరిస్థితుల ప్రకారం వేసవికాలంలో విపరీతమైన గాలివీస్తూ ఉండేది ఎత్తైన కొండ గాబట్టి అసలే చలి దానికి తోడు ఉండుండి వీచే శీతల వాయువుతో ప్రాణాలు ఉక్కబట్టేవి  అలవాటైన స్థానికులు ఒంటిమీద రంగులు చుట్టుకుని  చెవులు కప్పుకొని తమ విధులు నిర్వర్తించుకుంటూ ఉండేవాళ్లు  ఈ  గాలితో జ్వరాలు కూడా వచ్చేవి దీన్ని జ్వరగాలి అనే వాళ్ళు కొండ జబ్బు అనే వాళ్ళు దోమ కాటు కూడా  అందుకు కొంతవరకు కారణం.



కామెంట్‌లు