మన తిరుపతి వెంకన్న;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఎంతో నిరాశతో బయలుదేరి  మరల ప్రయాసతో ప్రాణమయమైన నీలాద్రి పాదాన్ని ఆశ్రయించాడు  నీలము అనేది ఒక రంగు ఈ రంగు ఊహ తప్ప నిజం కాదని మన పెద్దలు చెప్తారు ఆకాశంలో నీలి రంగు కనిపిస్తూ ఉంటుంది నీవు విమానంలో వెళ్లి అక్కడ చూస్తే ఆ రంగు కింద కనిపిస్తుంది భూమి మీద  లేని దానిని ఊహించుకుంటూ వెళ్లేటువంటి  పద్ధతి  ఈ నేలాద్రి పైన కూడా నీవు నాకు దర్శనం ఇవ్వడం లేదు కారణం నాకు అర్థం కావడం లేదు  నీలం రంగులో ఉన్న వెలుగు తప్ప నాకు ఇక్కడ ఏమీ కనిపించడం లేదు  ఎంత శ్రమపడి కాళ్లు నొప్పులు పెడుతూ ఉన్నా నడిచి వచ్చానే  నా మీద కరుణ చూపించలేవా వెంకటేశ్వర స్వామి  అనే ప్రశ్నిస్తున్నాడు అంటే  అతనికి తెలియకుండానే అతని మధ్యలో ఏదో ఒక మూల  స్వామి పై నమ్మకం ఏర్పడుతోంది  అని మనం అర్థం చేసుకోవచ్చు మనోమయమైనది అంజనాద్రి అని చెబుతారు  ఎంతో అలసిపోయి ఈ మనోమయ  క్షేత్రానికి చేరాను  అంజనాద్రి పై ఉన్న చెట్టు పుట్టల గుట్టలు అన్నీ వెతికి వెతికి  వేసారాను  నా మనసు బెదిరిపోతుంది నేను నీ దగ్గరికి ఎలా చేరగలరు  అని స్వామీజీని వేడుకుంటున్నాడు  అంటే మరికొంత  భక్తి ప్రేమ పెరిగింది అని  అర్థం  అంజనాదేవి హనుమంతుని యొక్క తల్లి  తల్లి పేరుతోనే ఆయనకు ఆంజనేయుడు అనే పేరు వచ్చింది  అంజనా దేవి కుమారుడు కనుక ఆంజనేయులు  వాయుదేవనే తన సొంతం చేసుకున్న ఈమె  వెంకటేశ్వర స్వామిని నాకు చూయించలేదా  అన్న ఆర్తి భావం కూడా ఇందులో జ్యోత్యకమవుతుంది.ఇలా కొండలు దాటుకుంటూ దాటుకుంటూ  దీని పై కొండ చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాళ్ల నొప్పులతో  నడవలేక నడవలేక నడుస్తున్నాడు. ఎంతో విసిగి వేసారి విజ్ఞానమయపు దారి  కదలి గరుడాద్రి చేరుకున్నాడు  గరుడ  అందరికీ తెలిసిన పక్షి  అక్కడ పరిస్థితి  రెండు రెక్కలను    భక్తులను ఆహ్వానిస్తున్నట్లుగా  సాక్షి  భూతంగా  ఆ దృశ్యం కనిపిస్తూ ఉంటుంది  అది గాలిలో తిరుగుతున్న అనుభూతిని కలుగజేస్తోంది  అలా తూలుతూ తుళ్ళుతూ  ఆ పరిసర ప్రాంతాలను అన్నిటినీ వెతికి చూశాడు  తన అన్వేషణలో ఎక్కడో ఒక చోట తప్పక దర్శనం దొరుకుతుంది అన్న నమ్మకంతో బయలుదేరి వెతుకుతుంటాడు  ఎంత వెతికినా ఎక్కడా కనిపించడం లేదు తన అభిప్రాయాలను మార్చుకొని వెను తిరిగి  వెళ్లడమా  లేక కార్యదక్షతతో  దర్శనం అయ్యేంతవరకు ఇలా కష్టాలనునిర్వహిస్తూ వెళ్లడమా  అన్న    మీ మాంస లో పడి  ఆలోచన ఎటూ తెగక  ముందుకు వెళ్లడానికి  నిర్ణయం తీసుకొని తర్వాత కొండపైకి బయలుదేరాడు.కామెంట్‌లు