మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మలేరియా నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం ఆ గాలి గీలి ఆచూకీ లేదు గడబిడ విడిపించే సన్నిధిని తట్టుకోవడానికి నిత్యం నెగళ్లు మండేవి  నేడు ఉక్క పోత సర్వసామాన్యం ఏసీల మోతతోనే నేడు తిరుమలను చూసి ఆశ్చర్యం కలగక మానదు మునుపు కలరా మసూచి, ప్లేగు సర్వసాధారణం  ప్రాణాంతక బ్యాక్టీరియా వైరస్లతో వచ్చే ఈ వ్యాధులను యాత్రికులు  మోసుకొచ్చేవాళ్లు తిరుపతి తిరుమల లోని వైద్య ఆరోగ్య  కేంద్రాలు కొంతవరకు చికిత్సను అందించేవి ఎక్కువ మంది దేవుళ్లను మొక్కుకుంటూ గంగమ్మను పూజించుకుంటూ నాటు మందులు మింగేవారు కలరా ప్లేగు ప్రకోపించిన వారిని తీసుకెళ్లి ఊరి బయట షెడ్లలో వదిలేసేవారు. తిరుమలలో  గో గర్భం డ్యామ్ పరిసరాల్లో కలరా ప్లేగు ఉండేవి  రోగులకు యానాదులు దయ తలిచి ఫలహారాలు అందించేవారు. యాత్రకు వచ్చేటప్పుడు ఎవరికైనా వ్యాధి సోకితే వారిని షేడ్లలో వేసేవారు అంతా దైవ ధ్యానం దర్శనానంతరం వచ్చి చూస్తే బతికుంటే  సరి లేకపోతే అంతటితో ఆశలు వదులుకొని కొన్ని నీళ్లు చల్లుకొని తమ ఊర్లకు తీసుకుని ప్రయాణమయ్యేవాడు ప్రస్తుతం ఆ మహమ్మారి జాడలు గతకాలజ్ఞాపకాలే  శతాబ్ద కాలం క్రితం తిరుపతి తిరుమల లో బావులు చెరువులతో కూడిన నీటి వసతి ఉండేది  దిగువ తిరుపతిలో మునిసిపాలిటీ వారు నీటి కుళాయిలు వేసి కొంతవరకు నీటిని సరఫరా చేసేవారు తిరుమలలో ప్రధాన జలవనరు అల్వార్ చెరువు  మహంతులు అక్కడి నుంచి పైపులు లాగి నీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఎన్నో బావులు  జల కొండలు గుంటలు కోనేరులు తటాకాలు ఉన్న తీర్థాలు తిరుమలలో ఉండేది  తిరుమల గుడి ఆవరణలోనే విరిజా నది పూలబావి ఆలయ నీటి అవసరాలను తీర్చేవి తిరుమలకు ఓవర్ హెడ్ ట్యాంకు లాంటి  మూర్తి నాయన చెరువు నుంచి నీటిని  పారించి పూలు పండ్ల తోటలను పెంచారు ధర్మగిరికి వెళ్లే మార్గంలోని మూర్తి నాగిని చెరువు నీటిని తోడుకోవడానికి చేసిన ఏర్పాట్లు ఈ మధ్య దాకా కనిపించేవి ఇప్పుడు కనిపించడం లేదు    గాలిగోపురానికి దగ్గర కొంచెం లోపలికి ఉన్న అడవిలో కట్టిన అల్లితోన చట్టం ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది  తీర్థాలకు నిలయమై తీర్థాద్రిగా ప్రశస్తి పొందిన తిరుమలలో  తాగునీటికి జాగ్రత్త పడవలసి వస్తోంది.
కామెంట్‌లు