మన తిరుపతి వెంకన్న;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 యాత్రికులను నిర్బంధించే అధికారం ఎవరికి లేదు ఈ తీర్థ సమీపాన సమ్మాళ్వార్ దేవస్థానము కలదు ఇది శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవస్థానము వలే వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సంబంధించినది కాదు.ఈ తీర్థము వైష్ణవుల ఆళ్వార్ తీర్థము అంటారు  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమునకు  కొండలు ఎక్కలేని వారు డోలిలలో వెళతారు డోలి అంటే  చిన్న ఉయ్యాల తొట్టి వలె ఒక చిన్న మంచం  ఒక అడుగు వెడల్పు రెండు అడుగులు పొడవు  ఒక బొంగునకు వేలాడగట్టి  ఇద్దరు దానిని మోస్తూ ఉంటారు  బుర్కా డోలి మేనా సవారి దొరుకుతాయి డోలికి సాధారణంగా రెండు రూపాయలు పుచ్చుకొని తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఒక ఫర్లాకు దూరంలో ఊరు బయట కొండ మీద వరకు మోస్తారు  యాత్రికులు డోలీలను  కుదుర్చుకున్నప్పుడే 
వారు  ఎక్కువ తీసుకోకుండా బేరం ఆడాలి. అందులో కమిషన్ ఏజెంట్ కూడా ఉంటారు  ఎవరి అవసరం లేకుండా కొండ మొదటికి పోయి డోలీలను  మాట్లాడుకొని పోవడానికి  దోవలో డోలీలను హెచ్చరించి డోలి తెచ్చుకోవచ్చు  ఒకప్పుడు హెచ్చరించిన బేరము కుదరకపోయినట్లయితే వారు వెంటబడి వస్తున్నా  వేరే డోలిని మాట్లాడుకోవచ్చును. డోని కుదిరిన తర్వాత కూర్చుండ పెట్టుకుని కొంత దూరము  వెళ్లి అదిగో కొండ అని ఒకప్పుడు ఇంతవరకే అని డోలిలో తీసుకొని  రావడానికి ఏర్పాటు చేసుకోవాలి  లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది  లేకపోయినట్లయితే యాత్రికుడు దిగిన సత్రం ద్వారా లేక యాత్రికులను ఆదరించు వారి ద్వారా ఏర్పాటు చేసుకోవాలి  మధ్యాహ్నం   కొండపైకి వెళ్లడానికి తిరుపతిలో  బోడి దొరకడం కష్టం  సామాన్లు మోయడానికి బిడ్డలను ఎత్తుకొని వెళ్లడానికి కూలీలు దొరుకుతారు. వారిని మూటల వారు అని పిలుస్తారు. వీరు మనిషికి అర్ధ రూపాయి చొప్పున కూలీ తీసుకుంటారు  తిరుపతి నుంచి కొండకు వెళ్ళే మార్గమునకు అలిపిరి రాస్తా అని తిరుపతి రాస్తా అని వాడుకలో ఉంది  ఇది సుమారు 7 మైళ్ళ దూరం ఉంటుంది మొదటి కొండ ఎక్కడానికి  చాలా కష్టపడాలి తర్వాత ఒక మైలు కొంచెం కష్టంగా ఉంటుంది ఆపైన రెండు మైళ్ళు  ఎక్కువ బాధలే ఉండవు ఆ తర్వాత  మోకాలు ఎక్కుడూ దిగుడు కొండ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దయ చేసి ఉన్న గ్రామం వరకు మార్గము తేలిగ్గా ఉంటుంది  మోకాలు ఎక్కుడూ దిగుడు  అనునది ఒక పర్వతము దిగి ఇంకొక పర్వతం ఎక్కుట అనగా  ఒక కనుమ దాటుట అనే  అరిపిరి అంటే కొండ పాదము అని అర్థం  ఇక్కడ  పాదరక్షలు గల మండపము   ఉంది.

కామెంట్‌లు