మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 డాక్టర్ రామస్వామి నాయుడు గారి సత్రం రైల్వేస్టేషన్కు దగ్గరలో ఉండి నాలుగు జాతుల వారికి  బస ఏర్పాటు చేస్తారు  నర్రా వారి సత్రం పూర్వం ఇది ప్రకాశం రోడ్ లో ఉండేది శిథిలమై పోగా కూల్చివేశారు  దీనికి సంబంధించిన భూములు మంగళం గ్రామంలో ఉన్నాయి  గ్రామానికి  గ్రామానికి పశ్చిమ భాగంలో ఉంది దీంట్లో కూడా నాలుగు జాతుల వారు దిగవచ్చు. శ్రీ హత్తి రాంజీ మఠం వారి ధర్మశాల పురానికి మధ్య ఉంది మార్కెట్ బజారుకు సమీపంలో ఉంది  ఇందులో కూడా నాలుగు జాతుల వారికి ప్రవేశం ఉంటుంది  వైశ్యుల సత్రములు కొత్త వీధిలో రెండు ఉన్నాయి సౌరాష్ట్రముల సత్రం ఒకటి శ్రీరాముల వారి సన్నిధిలో ఉంది. యాత్రికులు కూడా ఒక మంచి తాళం  తెచ్చుకోవడం మంచిది  కానీ పుష్ప తోట వద్ద డోలీలు విశేషంగా ఉంటాయి  ఈ తీర్థం చాలా ప్రాచీనం ఇక్కడ భూలోకంలో పార్వతీ పరమేశ్వరులు కపిల మహాఋషికి ప్రత్యక్షమయ్యారని  ఈ లింగం పాతాళములో సురల చేతను కపిల మహాముని చేతను పూజింపబడి జనులను ఉద్ధరింప భూలోకమునకు ఏ తెంచినట్లు చెబుతారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వకుల మాలిక దేవిని శ్రీ పద్మావతి దేవిని వివాహ రాయబారములకు  మొదట పంపునప్పుడు ఈ తీర్థంలో స్నానం చేసి శ్రీ కపిలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ప్రార్థించాలి అని చెప్తారు  భవిషష్యోత్తర పురాణం దీనికి ప్రమాణం  ఈ తీర్థం తిరుపతికి 1:30 దూరంలో ఉంది  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి కానీ కొండ ఎక్కడానికి కానీ మునుపే తీర్థానికి తిరుపతి నుంచి యాత్రికులు వెళ్లి స్నానం చేసి  వస్తారు. కొందరు హిరణ్యము లేకపోతే తీర్థ సార్థములు ఇస్తారు స్నానం చేసేటప్పుడు సంకల్పాదుడు దానధర్మముడు తీర్థ సర్ధములు మొదలగువానిని  చేయాలి అన్న నిర్భంతం ఏమీ లేదు ఇష్టమైన వారు తమ శక్తిని అనుసరించి  చేయవచ్చు  మనం చేసిన విధులు  సాఫల్యం కోసం ఇంతకు తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనం ఇస్తే బాగుంటుంది  ఆయా దానాలు  విధ్యుత్తముగా  చేయవలెనని అలా చేయకపోయినట్లయితే పెద్దలు మోక్షము పొందారని  చెప్పే మాటలు  విశ్వసించదగినవి కావు  తిరుపతిలో ప్రసిద్ధి చెందిన తీర్థ రాజ్యం యాత్రికుల రద్దీ స్థానికుల రద్దీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రకృతి సౌందర్యం  చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది  అక్కడకు వెళ్ళిన వారు  ప్రకృతిలో లీనమై  చాలా ఆలస్యంగా బయటకు వస్తారు.

కామెంట్‌లు