ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 పలనాటి యుద్ధం సినిమాకు పాటల రికార్డింగ్ జరుగుతుంది అని నన్ను డాక్టర్  కే వెంకట్ రాజు గారిని ఆహ్వానిస్తే వెళ్ళాం అంత క్రితమే ఘంటసాల వారికి పద్మశ్రీ బిరుదు వచ్చింది  రాజేశ్వరరావు గారికి కొంచెం అసూయ ఆ చిత్రానికి రాజేశ్వరావు గారు సంగీత దర్శకుడు  హరినాథ్ రాజుకు ఒక పద్యం ఘంటసాల వారితో చేయించారు మూడు పాదాలు సాఫీ గానే ఉన్నాయి నాలుగో పాదంలో ఏదో మనకు తెలియని మెళిక పెట్టారు  రాజేశ్వరరావు గారు పద్మశ్రీ గారు చాలా బాగా పాడుతారు  మరొక్కసారి మరొకసారి అంటూ తన అక్కస్సు నంతా తీర్చుకున్నారు నేను ఇంటికి వెళ్లి టీ తాగి వస్తాను అని ఘంటసాల వారు బయటకు రాగానే  పద్మశ్రీ గారు ఇక రారు మీరు వేరే ఏర్పాటు చేసుకోండి అన్నాడు రాజేశ్వరరావు గారు.
ఎవరిని తీసుకు రమ్మంటారు అంటే బాలమురళి గారు తప్ప మరొకర దీనికి తగరు అని చెప్పారు రాజేశ్వరరావు గారు ఇలా జరిగిందని వాడికి తెలిస్తే   వారు వస్తారో రారో అన్నా అనుమానం కూడా ఉంది నాకు అన్నారు రాజేశ్వర రావు గారు  మావాడు ఉన్నాడండి తీసుకొస్తాము గాని చెప్పి మా డాక్టర్ గారు వీరయ్య గారి కారులో బయలుదేరి మహతి కి (అది నారదుల వారి తంబురా పేరు మహతి) దానిని బాలమురళీ గారు తన ఇంటి పేరుగా మార్చుకున్నారు  కి వెళ్ళాం  విషయమంతా ఆయనకి చెప్తే మొదటి ఘంటసాల మాస్టారు బాధపడతారేమోనని సందేహించారు మురళి గారు విషయం మొత్తం చెప్పిన తర్వాత పెద్ద మనసుతో మాతో వచ్చారు  రాజేశ్వర రావు గారు సాదరంగా ఆహ్వానించి విషయమంతా చెప్పారు. అప్పటికే  వాద్య  బృందం శృతి చేసి ఉండటంతో ఫస్ట్ లోనే పది నిమిషాలలో రికార్డింగ్ పూర్తి చేశారు బాల మురళి గారు  అంతటి సత్తా గల గొప్ప వ్యక్తి ఆయన వారం మురళి గారితో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత మద్రాసులో వారి ఇంట్లో మహతిలో  మీ ఫోటో ఒకటి ఇవ్వండి సార్ అంటే తంబు నాతో సాధన చేస్తున్న  ఛాయాచిత్రాన్ని ఇచ్చారు దాన్ని మా పూజా మందిరంలోనే పెట్టుకున్నాను  వారి మిత్రులు సహాధ్యాయులు దత్తాడ పాండురంగరాజు ఎంవి రమణమూర్తి పి సూర్యరావు అంటే ఆయనకు ఎంతో ఇష్టం  బాలమురళీకృష్ణ గారి పేరు తగ్గట్టుగా నిజంగా అపర కృష్ణ అవతారమే ఎవరితో ఎలా నడగాలో ఆయనకు తెలిసిన దేవుడికి తెలియదు  పెద్దలను గౌరవించడం పిల్లలను ఆప్యాయంగా చేరదీయటం తోటి ఉద్యోగులతో కలగలిసి ఉండడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

కామెంట్‌లు