ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 శివరామారావు గారి ఇంట్లో వివాహం జరిగినప్పుడు దేవాలయ ప్రాంగణంలో భోజనాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన ఆనందం హుషారు యువకుడి లాగా అందరిని ఆహ్వానించడం వడ్డనలో తీపి పదార్థాలను అందరికీ అందించడంలో ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అలా ప్రవర్తించిన వింజమూరి శివరామ రావు రేడియో చేసిన సేవ అపారం  బందా గారితో నాటకం చేయడం అంటే గోపాలత్నానికి చాలా ఆనందం  రత్నం నీ వేషం రేపు పని బందాగాడంటే నాకు కుదరదు జిలేబి కానీ మరి ఏదైనా మంచి స్వీటు తీసుకుని వస్తే నేను ఉంటాను లేకపోతే రాను అని మారాం చేసేది చంటి పిల్లల ఆవిడ కోరినట్లుగానే మూడు రోజుల నాటకంలో మూడు రకాల తీపి పదార్థాలను తెప్పించి మా అందరితో పాటు వారు తినేవారు  వారికి మధుమేహం. బందా గారు ఛాయాచిత్రాలు తీసేటప్పుడు కూడా చక్కటి హాస్యాలు ఆడుతూ ఉండేవాడు వారి ప్రక్కన నిలబడిన ఆయన ఫోటో దిగితే దానిని అంగీకరించి తర్వాత రెండో ఫోటోలో నువ్వు నా పక్కన కాదు మీ అన్న లింగరాజు శర్మ పక్కకు వెళ్ళు ఆటో మీ యొక్క కమల కుమారి ఉంటుంది అని మేము నిలబడే స్థానాలను కూడా ఆయన నిర్ణయించేవారు అలాంటి గొప్ప వ్యక్తులతో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం  రంగస్థలంపై నాటకానికి భాష్యం చెప్పిన ఏకైక నటుడు బళ్ళారి రాఘవాచార్యులవారు  వారి శిష్యరికంలో నాటక మెలకువలను తెలుసుకున్న వారు బందా కనక లింగేశ్వర రావు గారు గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాసాలు కోలాటకంలో గిరీశం పాత్రధారిగా బళ్ళారి వారికి మంచి పేరు ఉన్నది  పౌరాణిక నాటకాలు వేసే నటుడు సామాన్యంగా సాంఘిక నాటకాలలో రాణించలేడు  అలాంటివారు ఈ నాటకంలో ఆ పాత్ర తన కోసమే సృష్టించబడినదా అన్నట్లుగా నటించారు.
ఒక పర్యాయం కన్యాశుల్కం నాటకం ప్రదర్శించవలసిన రోజు బళ్ళారి వారు తీవ్ర జ్వరంతో బాధపడి పాత్ర వేయడానికి ఎవరు ఉన్నారని ఆలోచిస్తున్న సమయంలో నేనున్నానని ముందుకు వచ్చింది  బందా కనక లింగేశ్వర రావు గారి అంత నాటకం ముగిసిన తర్వాత  వేదిక పైకి ఇతరుల సహాయంతో వచ్చి బంధా గారిని కౌగిలించుకొని ఈ రోజున నేను ఈ వేదికపై మరణించిన పరవాలేదు నన్ను నిలబెట్టే శిష్యుడు తయారయ్యాడు అని పొంగిపోయాడు అలాంటి బందా గారి గురించి  ఎన్ని విషయాలు చెప్పినా తక్కువే  తెలుగు నాటక రంగంలో పాత తరం నటుడు  నటులల్లో బందా కనక లింగేశ్వరరావు గారు తనకు తానే సాటి అనిపించుకుంటూ వారు ఆయన పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాలలో నటించే మెప్పించారు  ఏ పాత్ర వేసినా ఆ పాత్ర మాత్రమే రంగస్థలంపై కనిపిస్తుంది  అంతగా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయేవాడు
కామెంట్‌లు