ఓటే ప్రజాప్రగతిసూత్రం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
 ఓట్లపండగొచ్చెనే ఎల్లన్న2
నీ ఓటెవరికేస్తావే ఎల్లన్న2
కల్లు సారపోసి2
వేయినోటిచ్చినోడికేనాఓటు
మల్లన్న2
ఎన్నడుకల్లు సారాయితాగలేదా  నువ్వు2 
వేయినోటుచూడలేదా2
అమ్ముకుంటే నీ ఓటు అభివృద్ధి
చూడలేవే2
/ఓట్ల/
ఓటంటే నీ సొమ్ముకదాఎల్లన్న
ఓటంటే  ఉమ్మడి ప్రగతిసూత్రం2
ఓటంటే చుక్కముక్కకాదు ఎల్లన్న2
ఓటంటే రాజ్యాంగంమనకిచ్చిన
వజ్రాయుధం ఎల్లన్న2
అట్లయితే నాఓటమ్మనూ
మల్లన్న2
మన అభివృద్ధిని మరవనూ2

కామెంట్‌లు