ఎన్నికల- రణక్షేత్రం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497

ఎన్నికలంటే
ఎన్నికళలో
కులము,
మతము
వర్ణం
 వర్గం
కుమ్ములాటలు రెచ్చగొట్టే
స్వార్థపుశక్తులు 
చొరబడే రణక్షేత్రమిది

అమాయకులంతా
దిక్కు తోచక బ్రతుకు తెరువు కోసమై
పనిచూపే ఆసామికై ఆబగాఎదురుచూసే
నిస్సహాయతలు

అభ్యర్థులమోసపుటెత్తులు
ఎన్నైనా
 మారుపలకని
బాంచబ్రతుకు బ్రతకలేక బ్రతుకుతున్న దైన్యం వారిది

ఆకలి ప్రేగుల మెలిపెడుతుండగా
అన్యాయాన్ని న్యాయంగా
సమర్థించే అన్నెం పున్నెం ఎరగనోళ్ళం

ప్రతి ఐదేళ్లకు ఒకసారి వందకు,
మందుకు, మాబ్రతుకులను
మీ మీ విలాసాలకై తెగనమ్మి
మాఆశలు,ఆకాంక్షలను
కూల్చుకున్న దౌర్భాగ్యులం
మేము దేశజనాభా
లెక్కింపుకక్కరకొచ్చేవాళ్ళం
కామెంట్‌లు