సుభాషితాలు ;- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
జీవితాన్ని 
లెక్క వేసుకొని
జీవిస్తే ఎలా

అది
సుగంధంలేని 
గడ్డి పువ్వవుతుంది 

భయపడుతూ
కూర్చుంటే
బ్రతుకు నెప్పటికి గెలిచేవూ
సాహసమే
సక్సెస్ మంత్ర

ఎరుపెక్కిన కళ్లు
ఇక్కడ అణిచివేతుంది

వారి దేహచ్ఛాయల్లో
తిరుగుబాటు
వారి కనుకొలుకుల్లో
ఎర్రజీర

సూర్యుడినే
నిద్రలేపాడు
శ్రామికుడు
మబ్బుపట్టి(న)
ఆకాశం ముసుగుకప్పింది
సూర్యుడు బద్దకించి నిద్రపోయాడు 

గాలే కదా!
ముందు 
నీటికన్నా
నీరు జీవనాధారం!
గాలి ప్రాణాధారం!!

కవిత్వానికి
మూలముంది
అది నిజజీవితమైతే
నలుగురికి
దారిదీపమౌతది

ఆత్మీయత
మూల్యమెంత?!

తనపేగుత్రెంచుకొని 
కన్న
తల్లినడగండి 
అది అమూల్యం
అమ్మకానికి లొంగనిదికామెంట్‌లు