ధ్వజమెత్తి శత్రువుల నెదిరించవలెనోయ్;- అంకాల సోమయ్య దేవరుప్పుల జనగాం 9640748497
ధ్వజమెత్తి శత్రువుల
నెదిరించవలెనోయ్
ప్రియభారతమ్మునే
ప్రేమించవలెనోయ్

ప్రాణాలు దానాలు
చేసేయవలెనోయ్
త్యాగాలలోమనం
తరలిపోవలెనోయ్

నాది స్వతంత్రభారతమ్మని
నేను స్వేచ్ఛాస్వతంత్రుడనని
ఎలుగెత్తి చాటవలెనోయ్
మన దేశభక్తిని చూపవలెనోయ్

గాంధీ నెహ్రూ అంబేద్కర్
అహర్నిశలు దేశంకోసం
యాతనపడెనోయ్
బానిసత్వం బాపెనూ
స్వేచ్ఛావాయువందించెను

కామెంట్‌లు