సాధుస్వభావులు - క్రూరస్వభావులు= కవిమిత్ర, శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098
  🌻బలవర్ధకము లైన 
కమ్మని పాలనొసంగు
   పచ్చగడ్డి తిన్న ఆవు
 "సాధు జంతువు" సుమతీ! 
 🌻ఎంత మర్యాద చేసిన
  పాలను పోసి పెంచిన
      విషమునే గ్రక్కు పాము
  "క్రూర జంతువు" సుమతీ!            
      (అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,)
👌ఆవు... సాధు జంతువు! పాము.. క్రూర జంతువు ! ఈ రెండింటి మధ్య ... పాత్ర, అపాత్రములకు యున్న వ్యత్యాసముంది! ఆవు.. గడ్డిని తిని  పాలను ఇస్తుంది. అట్లే, పాము.. పాలు త్రాగి, విషమును గ్రక్కుతుంది! ఇది అనుభవజ్ఞుల మాట! సాధు స్వభావులు.. క్రూర స్వభావులు గురించి వివరించు చున్నదీ సుభాషితము!  
 🚩పాత్రాzపాత్రా వివేకోస్తి
      ధేను పన్నగ యోరివ!
      తృణాత్ సంజాయతే క్షీరం 
      క్షీరాత్ సంజాయతే విషమ్!!
    (సుభాషిత రత్నావళి.,)
          🚩తే.గీ.
     గడ్డితిను గోవు  పాలను కలిమి నిడగ
     పాలు త్రాగుచు విషమును పాముచిందు
     పాత్ర లక్షణములబట్టి ఫలితముండు
     మంచి చెడులదౌ రూపమ్ము మహిని ఇదియె!
      [...రచన:- డా. శాస్త్రుల రఘుపతి.,]
      *****************
 🚩 ఆటవెలది పద్యము:-
     పచ్చగడ్డి తినియు, పాలిచ్చు గోవును 
     సాధుజంతు వట్లు సజ్జనుండు; 
      పాలుత్రాగి పాము, ప్రబల విషము గ్రక్కు 
      క్రూరబుద్ధి గలిగి క్రూరు డట్లు.
        [ ...రచన:- విద్వాన్ పైడి హరనాథ రావు.,,]
కామెంట్‌లు