ధీమంతుల గుణములు కవిమిత్ర, శంకర ప్రియ ,-సంచార వాణి:- 99127 67098
 ధీమంతుల గుణములు
కలిగియుండా లెపుడు 
    జ్ఞానాభిలాషు లందరు
 ఓజోవతి! ఓ సుమతీ!
         ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ ,)
      "ధీమంతులు" అనగా. సద్బుద్ధి కలవారు! మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఆచరించేవారు! వారు.. ఆధ్యాత్మిక జ్ఞానము, మరియు భౌతిక విజ్ఞాన సంపన్నులు! అటువంటి వారు ... అష్ట విధ గుణములతో విలసిల్లు చున్నారు! అవి...
✅వినాలనే కోరిక కలగడం (1) 
✅వినిన విషయాన్ని గ్రహించటం(2)
✅గ్రహించినదానిని మనస్సున నిలుపుకొనడం (3)
✅నిలుపుకొనిన దానిని
గుర్తుకు తెచ్చుకోవడం (4)
 ✅చెప్పడం, ఊహించడం (5)
✅సంశయమును నివృత్తి చేసుకోవడం (6)
✅ భావార్థమును చక్కగా గ్రహించడం (7)
✅తత్త్వజ్ఞానమును
తెలుసుకొని, ఆచరించడం (8)
       అనెడు... ఈ ఎనిమిది బుద్ధిమంతులకు గల సుగుణములు!          
🚩గ్రహణం ధారణం చైవ
     స్మరణం ప్రతిపాదనమ్ |
     ఊహాzపోహాఽర్ధ విజ్ఞానం
     తత్త్వజ్ఞానం చ ధీగుణాః! 
         (కామoదక నీతిసారం)
           🪷🔆🪷
          🚩 కంద పద్యము
    వినగల వాంఛయు, గ్రహణము,
    తన మనమున నిలుపుకొనుట, ధారణయును, బు
    ద్దిని గని నుడువుట, మది భా
    వనయును, సంశయ నివృత్తి, ప్రజ్ఞానిధులౌ!!
    [రచన:- డా. శాస్త్రుల రఘుపతి.,]
      ******************
         🚩తేట గీతి పద్యము*}
     గ్రహణ ధారణ స్మరణముల్ కలిగియుండి,
     దాని ప్రతిపాదనమ్ము, తత్ తత్వగరిమ
     నెఱిగి, చెప్పు టూహించుట లింత కాక,
     సంశయనివృత్తి కలిగి ప్రశంసలందు.
     [ రచన:- కవికల్పభూజ, చింతా రామకృష్ణా రావు.,]
కామెంట్‌లు