భారత రత్న అంబేద్కర్!;- కవిమిత్ర, శంకర ప్రియ.,-సంచార వాణి:-99127 67098

 👌సంఘ సంస్కర్తవు నీవె 
  ఆదర్శ మూర్తివి నీవె!
     "భారత రత్న" అంబేద్కర్!
 జోహారులు మహాశయ! (1)   
    భారతదేశ రాజ్యాంగ
నిర్మాణ శిల్పివి నీవె!
    మహా మనీషివి నీవె!
జోహారులు మహాశయ!
      (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🌻 మనసనాతన ధర్మ పరిరక్షణకు సంకల్పము కావించిన గొప్పమనిషి! అందరికీ సమన్యాయం.. పౌరసత్వం.. ప్రాతినిధ్యం కావాలి! అని, ఎలుగెత్తి చాటిన దేశభక్తుడు... భీoరావు రాంజీ అంబేద్కర్!
     భారత రాజ్యాంగ నిర్మాణ రమణీయ శిల్పి! ఆ మహానుభావున్ని... "భారత రత్న" పురస్కారంతో సత్కరించింది, మన ప్రభుత్వం!
       🚩సీస పద్యం 
      భీంరావు రాంజి అంబేద్కర్ ప్రముఖ భార 
తీయ యార్ధిక శాఖ దిట్ట యతడు 
      రాజ్యాంగ నిర్మాణ రమణీయ శిల్పిగా 
రాజ్యాంగ చట్టముల్ రచన జేసె
     యంటరాని తనము నధిగమించియు బహు 
విద్యలు నేర్చియు వెలిగె నితడు 
      న్యాయ శాస్త్రా మంత్రిగా యశస్సును బొంది 
ప్రథముడై వెలుగొందె ప్రభుత యందు 
         🚩తే.గీ.
     సంఘ సంస్కర్త మాన్యుండు సత్కృత మతి 
అతడు "భారత రత్న"మై యలరినాడు 
      రాజకీయ జీవితమున రాణకెక్కె 
త్యాగమే జీవనంబైన ధన్య జీవి!
       [ రచన:- విద్వాన్ పైడి హరనాథ రావు.,]
కామెంట్‌లు