భయాందోళన పోకార్చు - కవిమిత్ర, శంకర ప్రియ.,-సంచార వాణి:- 99127 67098
  🔱సమస్త మానవాళికి
 భయాందోళన పోకార్చు
     భద్రతను సమకూర్చు
 భయభంజిక! శ్రీమాత!
     (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
👌భక్త మహాశయులకు భయమును పారద్రోలు చున్నదీ జనని! జీవితమునందు శాంతిని, దాంతిని, భద్రతను... అనుగ్రహించు చున్నది! సాధకులకు ధైర్యమును స్థైర్యమును కలిగించు చున్నది! అట్లే, విజయమునకు కారణమగుచున్నది, శ్రీమాత!
      శ్రీలక్ష్మీసహస్ర నామములలో  "భయ భఞ్జిక" 231వ.నామము!
         🚩 కంద పద్యము 
    భయ భఞ్జికా! మనంబున
    భయమును పోకార్పు మమ్మ! భద్రద వగుచున్,
    జయ కారణమగుమీ! య
    క్షయ ధైర్యద వగుచు నన్నుఁ గావుము కృపతో!
     [రచన .. చింతా రామకృష్ణారావు.]

కామెంట్‌లు