ఆత్మారాముడు.. రాముడు (అష్టాక్షరీ గీతి ) కవిమిత్ర, శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098

  కౌసల్యా దశరధుల 
ముద్దుల కుమారుడవు!
   మేలుకో! అయోధ్యా రామ!
శ్రీరామ! జయ శ్రీరామ! (1)
          
    మా"హృది"యను అయోధ్య
పురమందు కొలువైన
   ఆత్మారామ! శివరామ!
మమ్ము ఏలుకో! శ్రీరామ! (2)
                  
    అంతరంగము నందున్న
కామాది శత్రువులను
   అరికట్టి, మమ్ములను
కాపాడుమయ్య! శ్రీరామ! (3)
 
    అద్వితీయము దివ్యము
ఆత్మానందమును మాకు
    అనుగ్రహింపు మో స్వామి!
ఆత్మారామ! ఓ శ్రీరామ! (4)
                    
   🕉️శ్రీరామ! జయ శ్రీరామ! జయ జయ శ్రీరామ!
కామెంట్‌లు