కరతాళ శబ్దములు; - "కవి మిత్ర" శంకర ప్రియ .,-సంచార వాణి :- 99127 67098
    తామెంతటి వారైనను
ఒక్కచేతితో చప్పట్లు
    రానేరావు, నిష్ఫలము
నిజమిది! ఓ సుమతి! (1)
     ఐకమత్యంతో మనము
రెండుచేతులు కలుప
     కరతాళ శబ్దములు
మారుమ్రోగు! ఓ సుమతి! (2)
      (అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,)
🚩 ఒకేచేతితో చప్పట్లు కొట్టలేము! రెండు చేతులనుకలిపి కొట్టినప్పుడే... "కరతాళ శబ్దములు (చప్పట్లు)" చేయగలము!  అలాగే, మనమంతా కలిసి; ఒక సత్కార్యమును ఆచరించుటకు, అకుంఠితమైనదీక్ష  పట్టుదల అత్యవసరం! ఆ విధంగా ఐకమత్యముతో   ఉద్యమముగా,  కొనసాగించినప్పుడే .. సామాజికంగా, మనమందరం మంచిప్రయోజనములను పొందగలము! 
      ఇది .. సుభాషితము అనగా "మంచి మాట"! నిద్రావస్థలో నున్న మనలను "మేలు కొలుపు" చున్నది.
 👌యథైకేన న హస్తేన  
 తాలికా సంప్రపద్యతే !
     తథోద్యమ పరిత్యక్తం
 కర్మనోత్పాద్యతే ఫలమ్ !!
           🚩తే.గీ.  
    చప్పటుల్ గొట్ట నొకచేత నొప్పనటులె
 ఉద్యమించక కార్యమ్ము లొసగవెపుడు
     సత్ఫలంబులన్, గావున సాధనకయి
 కలిసి పనిచేయు డందరున్, ఘనతరముగ!
("కవికల్ప భూజ" చింతా రామకృష్ణా రావు.,)
కామెంట్‌లు