జన్మదుఃఖం! జరాదుఃఖం!- కవిమిత్ర, శంకర ప్రియ-సంచార వాణి:- 99127 67098
 ⚜️భౌతిక దేహము నందు
 జననం నుండి, మరణం
     వరకు, వేదనలన్ని
  కనరండి! ఓ సుమతి!
      ( అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ)
 👌 ఆధ్యాత్మికదృష్టితో విచారణ సల్పినప్పుడు... జీవుడు... ఈపంచ భూతాత్మకమైన దేహమునందు;  పుట్టుట.. పెరుగుట.. ముసలితనం వచ్చుట... పిమ్మట, గిట్టుట  వరకు... అన్నీ దుఃఖ మయములే! అట్లే, భార్య.. భర్త.. బిడ్డల నుండి మనోవ్యధలు కలుగు చున్నాయి! జనన మరణ ప్రవాహరూపమైన సంసారమే ఒక మహా సముద్రము వంటిది! ఈ జీవితమంతా వేదనా భరితమే! అవి.. మళ్ళీ మళ్ళీ వస్తూనే యుంటాయి. కావున, ఓ సాధకులార! మీరు సావధానులై జీవించండి! అని, జ్ఞానవిజ్ఞాన ద్రష్టలైన, మనమహర్షులు.. సకల మానవాళికి హితోపదేశము చేస్తున్నారు! శివమస్తు!
  
👌జన్మ దుఃఖం, జరా దుఃఖం, 
 జాయా దుఃఖం, పునః పునః| 
   సంసార సాగరం దుఃఖం 
 తస్మాత్ జాగ్రత  జాగ్రత!!
       (తత్త్వోపదేశము, రెండవ శ్లోకరత్నము)   
   🚩 తేటగీతి పద్యం 
  పుట్టు వొందుట బాధయే, ముసలి తనపు
  బాధ, సంసార బాధలు, భార్య వెతలు,
  తలకు మించిన బాధల తలచుకొనుచు
   జాగరూకులై ఉండుడీ జనులెఱింగి!
        [ డా. శాస్త్రుల రఘుపతి., ]
         ***********
      🚩 తేట గీతి పద్యం
 జననమరణముల్, ముదసలితనము, దుఃఖ
 మయమిలను, కలుగుచు నుండు మరల మరల,
 భవ సముద్రము దుఃఖము, వరలు నిజము
 నెఱిఁగి వర్తించి మేల్గన వేల నీవు?
        [ కవికల్పభూజ, చింతా రామకృష్ణా రావు.,]
కామెంట్‌లు