🪷 జ్ఞాన విజ్ఞానములను
అనుగ్రహించు చున్నావు!
శ్రుతి రూపిణి! శ్రీ వాణి!
శ్రీలలిత! జగన్మాత!
(అష్టాక్షరీ గీతి , శంకర ప్రియ.,)
🚩"శ్రుతి" అనగా వేదము, జ్ఞానము, విజ్ఞానముల స్వరూపిణి.. శ్రీమాత! శుభ కార్యములకు ఫలము నొసగునది! రతిరూపిణి, రమణీయ గుణములు కలిగినది! శక్తిరూపిణి, శతపత్రనికేతని, జనని! పుష్టిరూపిణి, పురుషోత్తముని రాణి... శ్రీ వాణి! ఆ శ్రీమాతకు రెండుచేతులను జోడించి నమస్కరించు చున్నాను! అని; జగద్గురు శంకర భగవత్పాదుల వారు, భక్తి ప్రపత్తులతో శ్రీమహాలక్ష్మి దేవిని ప్రార్థించు చున్నారు!
🪷ప్రార్థనా శ్లోకము
శ్రుత్యై నమోస్తు! శుభ కర్మ ఫల ప్రసూత్యై!
రత్యై నమోస్తు! రమణీయ గుణార్ణవాయై!
శక్ష్యై నమోస్తు! శతపత్ర నికేతనాయై!
పుష్ట్యై నమోస్తు! పురుషోత్తమ వల్లభాయై!!
(శ్రీ కనకధారా స్తవము.. 13.వ. శ్లోకము, జగద్గురు ఆదిశంకరులు)
🔆మత్తేభం వృత్తం
లలితా! వందనముల్, శ్రుతిప్రియ నుతా!
లావణ్య సౌశీల్య పు
ష్పలతా! వందనముల్, రతిప్రియ నుతా! సత్కర్మకృ ద్ధస్త క
ల్పలతా! వందనముల్, పరాక్రమ పరా! భక్త ప్రియాధార! వం
దలు వేల్ వందనముల్, వివర్ధనకరా! నైవాస్య పద్మాంతరా!
[ తెలుగు సేత:- వెలుదండ సత్యనారాయణ., పరమార్థకవి.,]

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి