కౌశికీ దేవి - శ్రీమా కవి మిత్ర, శంకర ప్రియ , శీల ,-సంచార వాణి: 99127 67098
🔱శ్రీగౌరీ శిరోజ జాత!
  కమల నేత్రివి నీవె!
     నీల వేణివి జనని!
  కౌశికి! జయ శ్రీమాత!
        [అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ., ]
👌కౌశికీదేవి.. శ్రీపార్వతీమాత యొక్క కేశమునుండి సంభవించినది! పరమేశ్వరి దివ్యలీలా స్వరూపిణి! శ్రీవీరభద్రుని సోదరి!
    విశ్వామిత్రునకు మరొకపేరు.. కౌశికుడు! కుశికుని కుమారుడు - కౌశికుడు!
⚜️"కౌశికి" నామము.. శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రములో ...  232వ. నామము!

     🚩సుగంధి వృత్తము:-
  పార్వతీ శిరోజజాత! పద్మనేత్రి! కౌశికీ!
  గర్వభంజనంబుచేసి కావుమా! ననున్ సదా!
  నిర్వికార నిష్కళంక! నీ కృపా కటాక్షమే
  సర్వసిద్ధి సత్ఫలంబుఁ జక్కగా నొసంగునే!
       [ రచన .. చింతా రామకృష్ణారావు.,]

   🕉️ శ్రీమాత! జయ శ్రీమాత! జయ జయ శ్రీమాత!

కామెంట్‌లు