మల్లెపూవు ఎందుకు
తెల్లగా ఉంటుంది
గులాబీ ఎందుకు
ఎర్రగా ఉంటుంది
పల్లె సీమ ఎందుకు
పచ్చగా ఉంటుంది
తల్లి మనసు ఎందుకు
ప్రేమగా ఉంటుంది
నాన్న మనసు ఎందుకు
వెన్నలా ఉంటుంది
అన్న తోడు ఎందుకు
నీడలా ఉంటుంది
మంచు చూడ ఎందుకు
చల్లగా ఉంటుంది
అమ్మ ఒడి ఎందుకు
మెత్తగా ఉంటుంది
పాప పలుకు ఎందుకు
తీయగా ఉంటుంది
తెలుగు భాష ఎందుకు
గొప్పగా ఉంటుంది
సెలయేరు ఎందుకు
గలగల పారుతుంది
తారకమ్మ ఎందుకు
మిలమిల మెరుస్తుంది
పాపాయి ఎందుకు
కిలకిల నవ్వుతుంది
నవ్వుల ముఖమెందుకు
కళకళలాడుతుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి