పూలలాంటి పిల్లలు;- -గద్వాల సోమన్న,9966414580
పసి పిల్లల కళ్ళలోన
పల్లవించు వెన్నెల సోన
ప్రేమ ధార ప్రవహించును
పవిత్రమైన గుండెలోన

చిన్నారుల పలుకులోన
ముద్దులొలుకు కులుకులోన
అందాలే విరబూయును
హంసలాంటి నడకలోన

చిరునవ్వుల మోములోన
సిరిమల్లెల నవ్వులోన
ముగ్ధమనోహరం కదూ!
చిన్నారుల చూపులోన

శుద్ధమైన నోటిలోన
పూలవంటి మేనులోన
దైవత్వం కన్పించును
పసి పిల్లల తలపులోన


కామెంట్‌లు