నిజమేరా!- -గద్వాల సోమన్న,9966414580
మల్లెపూలు విరిసెరా!
తెల్లదనం తెలిసెరా!
ఎల్లలు లేని సంతసం
ఎల్లరిని వరించెరా!

బాల్యమే గొప్పదిరా
మూల్యమే లేదురా
భాగ్యమంటే అదేరా!
యోగ్యంగా తలచరా!

కళ్ళు తరిచి చూడరా!
కుళ్లు విడిచి బ్రతకరా!
ముళ్ళు చెడ్డ దారిలో
వెళ్లు మంచి దారిలో

తల్లి వంటి తెలుగురా!
పల్లెసీమ సొగసురా!
కల్లలు ఎరుగని బాల్యం
పల్లవించు రాగమురా!
;;

కామెంట్‌లు