ప్రాస పద గేయం;- -గద్వాల సోమన్న,9966414580
చెట్టుకు బలం వేరు
మనిషికందం గోరు
అమృతం సమము నీరు
క్షేమాన్ని అది కోరు

మంచిది కాదు పోరు
అదే సాగర హోరు
అదుపు చేయుము నోరు
దిద్దుకొనుమిల తీరు

మనిషికి మనిషి తోడు
గగన కుసుమం నేడు
ప్రేమలు తరిగె చూడు
మంచి రోజులు నాడు

నైరాశ్యమే వీడు
బ్రతుకును చేయు మోడు
వదిలివేయుము గోడు
జయించినచో ఱేడు


కామెంట్‌లు