మేలు చేసే కోపాలు;- -గద్వాల సోమన్న,9966414580
విద్య నేర్పడానికి
బుద్ధి చెప్పడానికి
గురువు గారి కోపం
భవితకదే దీపం

బ్రతుకు దిద్దుడానికి
మెతుకు పెట్టడానికి
అమ్మ గారి కోపం
ప్రేమకు ప్రతిరూపం

దారి చూపడానికి
కోరి నడపడానికి
స్నేహితుని కోపం
సువాసనల ధూపం

హద్దు తెలపడానికి
వృద్ధిని చూడడానికి
పెద్ద వారి కోపం
చూడ ఇంద్ర చాపం


కామెంట్‌లు