నిజమే కదూ!!;- -గద్వాల సోమన్న,9966414580
మహాత్ముల త్రోవలోన
మంచియే జరుగుతుంది
కన్నవారి ప్రేమలోన
త్యాగమే ఒలుకుతుంది

పెద్దవారి మాట వినిన
భవిత చక్కబడుతుంది
గురుదేవుల బోధ కనిన
బ్రతుకు బాగుపడుతుంది

చక్కనైన చెలిమిలోన
అనుబంధం దాగుంది
అనురాగపు వనంలోన
అన్యోన్యత పండుతుంది

శుద్ధమైన మనసులోన
దైవత్వం మెరుస్తుంది
అతిచిన్న వయసులోన
ఆనందం చిందుతుంది


కామెంట్‌లు