హితోక్తులు;- -గద్వాల సోమన్న,9966414580
మల్లెలు విరిసిన చక్కదనము
పల్లెలు జగతికి మూలధనము
కల్లలు లేని  శుద్ధ హృదయులు
పిల్లలు నవ్విన నిండుదనము

బాలలు ఇంటికి బహుమానము
వారి విలువలే అసమానము
చేసిన తప్పులు క్షమించే
గొప్పది చాలా  క్షమాగుణము

కన్నవారికుంది త్యాగగుణము
ఉన్న ఊరుకుంది ప్రేమ గుణము
సంతోషమే సగము బలము
మనోహరమైన  పూలవనము

కల్గియుండుము సమభావము
మానవత్వమే కొలమానము
విలువైనది విద్యాదానము
నెమ్మదినిచ్చు హృదయ ధ్యానము


కామెంట్‌లు